వేడెక్కిన కంటిపాప...
గుండె గొంతుపై ....
విచ్చు కత్తులు నాట్యమాడిన భావన...
హృదయంలోని ప్రతికణం....
రుధిరంలో తడిసి ముద్దై...
అల్లకల్లోలమైన నరక యాతన...
గుండె లోతుల్లో చేయి పెట్టి ....
మెలివేస్తున్న ఆవేదన....
వేదనను రోదనను ....
తట్టుకోలేక.....
బయటికి ఉబికి వచ్చి ....
గాలిలో కలిసిపోవాలనే...
తాపత్రయంతో....
పారిపోవాలని ....
ప్రయత్నిస్తున్న.....
ఆ నీటి బిందువు....
ఎంత చేసినా బయటికి రాదేమి..?
గుండె సుడులను దాటాలని ...
అది ఎంత ప్రయత్నించినా...
కనురెప్పలను....
దాటిరాదేమి...
ఆ కన్నీటి చుక్క....
నా కంటిపాప వేడిలో...
ఆవిరి అయిపోతోంది ....
అది బయటికి వస్తేనే....
నా మానసిక సంద్రంలో...
ప్రశాంతత కదా...
మనస్వినీ...
No comments:
Post a Comment