చెదరిన మనసు...
వింజామర వీచికల్లో ....
మంద్రమైన సంగీత ఝరిలో ...
తేలియాడుతూ....
మఖమల్ వస్త్రాల పానుపులో ....
ఒదిగిపోతూ...
రాజసానికి...
పోటీ పడుతూ...
వయ్యారాలు చిందిస్తూ...
నింగిలోని జాబిలి నేలకు దిగిన చందాన...
అందానికే వన్నెలు దిద్దే....
అందచందాలను చూసి...
ముగ్ధమైన మనస్సుతో....
నాలో భావుకత చెలరేగిన వేళ...
నన్ను నేను కవిరాజుగా భావించి ....
అక్షర మాలికలను పొందుపరిచి...
గజల్ రూపంలో నీ మెడకు ....
హారంగా తొడగాలని....
ఆరాట పడుతున్న వేళ...
ఎందుకో ఏమో గాని ....
నా అక్షరాలు....
గతి తప్పి...
చెల్లా చెదురుగా...
అటూ ఇటూ...
చెదరిపోతున్నాయి...
నాలో భావుకత లోపించిందా...
మనసు తోడు రానంటుందా...
లేదు లేదు...
నీ అంద చందాలను మించిన...
నీ వ్యక్తిత్వం ....
నా మనసును చెదరగొట్టింది...
మనస్వినీ...
No comments:
Post a Comment