మా యువరాజు...
చిట్టి పొట్టి అడుగులు....
తప్పటడుగులు వేస్తూ ....
బోసి నవ్వులతో ....
పడుతూ లేస్తూ ....
నా వైపు అడుగులు వేస్తున్న ....
నిన్ను చూసి నా హృదయం ....
ఉప్పొంగిపోయింది....
నా ప్రతి ఆలోచన....
నా ప్రతి ప్రణాళిక....
నీకోసమే....
కాలం గడుస్తూ పోయింది...
చిన్నారి తనం నుంచి...
క్రమంగా ఎదుగుతూ ఉన్నావ్...
అనుకున్నది అనుకున్నట్లే జరిగితే....
జీవితం ఎందుకవుతుంది....
ఎన్నెన్నో మలుపులు....
ఎటు చూసినా సమస్యలే...
సమాజంనుంచి ఎదురు దెబ్బలు...
నా వాళ్ళే పరాయి వాళ్ళయిపోయారు...
పూవులా పరిమళించిన వాళ్ళే...
ముల్లులా గుచ్చుకుంటే....
ఎం చేయాలో తోచని స్థితిలో...
ఉన్న నాకు...
ఒక తోడుగా ఒక స్నేహంగా..
నిలిచావ్...
నా నిర్ణయాలను ప్రశ్నించకుండా...
నేను చేసేవన్నీ...
నిజాలే అని నిర్ణయానికి వచ్చి...
నేనున్నా అంటూ...
తోడు నిలిచిన నువ్వు ....
నాటి నువ్వేనా...
నాటి తప్పటడుగులు...
నా అడుగులకు జాడలుగా...
నీ ఆలోచనలు...
నా అంతరాలకు అనుగుణంగా...
నిలిచిన వేళ...
ఎంత ఎదిగిపోయవు కన్నా...
నిజంగా ప్రిన్స్
మన యువరాజే...
కాదని అనగలమా...
మనస్వినీ....
No comments:
Post a Comment