మృత్యు ఘంటికలు...
కన్నులు తెరిచినా ....
కన్నులు మూసినా...
నేనెక్కడికి వెళ్ళినా....
నీ దృష్టంతా నా మీదే...
ఎక్కడికెళితే అక్కడికే వస్తావు...
ఎదో ఒక రూపంలో పలకరిస్తావు...
నాలో ఏవో ప్రకంపనలు రేపుతావు...
చేతులు చాచి రా రమ్మని పిలుస్తావు...
నీకెన్ని సార్లు చెప్పాలి...
నువ్వంటే నాకిష్టం లేదని...
నేను రానే రానని...కౌకిట బంధించాలని నువ్వు...
ఎదో విధంగా తప్పించుకునే నేను..
ఎందుకీ దోబూచులాట...
నాకు తెలుసు చివరగా ఓడిపోయేది నేనేనని...
నీ కౌగిట కరిగిపోక తప్పదని...
అయినా నా పంతం నాదే...
నువ్వు నన్ను చేరుకోవాలని ఎంత తపించినా...
నేను మరొకరి కోసం తపిస్తున్నా...
అక్కడ నా తనివి తీరితే....
నేనే వస్తా నీకోసం...
ఇది నిజంగా నిజం...
అవును నా మృత్యు దేవత నువ్వైతే..
నాకు భయమా...
నీకంటే ఎక్కువగా ప్రేమించే మరొకరున్నారు...
నేను నీ చెంతకు రావాలంటే....
ఆమె అనుమతి కావాలి...
నువ్వు నన్ను ఈ లోకం లోనుంచి మాయం చేస్తే...
ఆమె నాకు ఊపిరి పోస్తోంది...
నా ఆయుష్షు తీరాక నీ ఒడికి నేను వస్తే...
ఆమె ప్రేమ నా జీవన ఘడియలను పెంచుతుంది...
అంతే మరి నువ్వు నా చావువైతే...
ఆమె నా బతుకు...
నీ కాలి యందెలు మృత్యు ఘంటికలయితే..
ఆమె పద మంజీరాలు నా హృదయ స్పందనలు...
ఓ మృత్యు దేవతా ఆమె పై నీకు అసూయగా ఉందా...
ఆమెవరో తెలుసుకోవాలనుందా...
ఆమె నా....
మనస్వినీ....
No comments:
Post a Comment