వాన చినుకు....
మసకేసిన మబ్బులనుంచి...
జారిపడుతోంది ఓ నీటి చుక్క....
అనంత వాయువులను ....
చీల్చుకుంటూ...
వడివడిగా దూసుకు వస్తూ....
ఆనందంగా....
పారవశ్యంగా....
మరెంతో తన్మయత్వంగా...
చిన్న బిందువై...
నా గుండెపై వాలింది...
అంతలోనే....
ఏమయ్యిందో ఏమోకానీ...
వచ్చినంత వేగంగానే....
నన్ను విడిచిపోసాగింది...
అది చూసి నేను....
ఆ చుక్కను దోసిట పట్టాలని..
ఎంతో ఆర్తిగా ముందుకు కదిలాను...
ఓ వాన నీటి చుక్కా...
ఎందుకలా చేస్తున్నావ్...
నన్నెందుకు విడిచి పోతున్నావ్...
అంటూ ఆశగా అడిగాను...
ఆ చుక్క అప్పుడు ఏమందంటే....
నీ మనోసంద్రంలో ....
చెలరేగుతున్న
సుడులనుండి...
జాలువారుతున్న ....
కన్నీటి చుక్కల ముందు...
నేను నిలువగలనా...
ఆ నిట్టూర్పుల వేడిని....
నేను తట్టుకోగలనా....
మేఘరాజు ఉరుముల ...
విద్యుల్లతలో పుట్టినా...
నీ గుండె మంటను తాళలేను ....
అంటూ చిన్న
బుచ్చుకున్న...
ఆ చినుకు..
క్రమంగా....
పుడమిలోకి జారుకుంది...
మనస్వినీ...
No comments:
Post a Comment