వాడిన వసంతం
రాలిపడుతున్న కలలను....
ఏరుకోవాలని ....
ఆశించాను....
చల్లని వెన్నెల .....
కురిపించే ....
సవరించాలని.....
ఆరాటపడ్డాను...
కడలి కెరటాలను...
దోసిట పట్టాలని...
చేతులు చాచాను....
హోరుగాలిలో....
తరంగాలను గుండెల్లో ....
బంధించాలని.....
ఊపిరి బిగ పట్టాను....
ఏమీ చేయలేక పోయాను....
వాడిపోయి వడలిపోయి..
తరలిపోతున్న....
వసంతాన్ని .....
అలా చూస్తూ.....
నిలబడిపోయాను...
మనస్వినీ
No comments:
Post a Comment