హైదరాబాద్ మునిగితే కేసీఆర్ ఏం
చేస్తాడు?
ఈ పోస్టు నిస్సందేహంగా
సోషల్ మీడియాలోని ఆంధ్రా మేధావుల కోసమే రాస్తున్నా.. మళ్ళీ చెబుతున్నా నేను కేసీఆర్
అభిమానిని కాదు తెరాస కార్యకర్తనూ కాను. ఏదైనా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేస్తా..
ఇక విషయానికి వస్తే... హైదరాబాద్ మునిగిపోయింది, వందలాది కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి.
ప్రజల కష్టాలు వర్ణనాతీతం. అయితే సోషల్ మీడియాలో ఆంధ్రా మేధావులు స్పందిస్తున్న తీరు
చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ఏమయ్యింది బంగారు తెలంగాణా అని ఒకరు, కేసీఆర్ నిద్రపోతున్నాడా
అని ఒకరు, ఆంధ్రావాళ్ళని తిట్టి తెలంగాణా తెచ్చుకున్నారుగా ఇప్పుడేమయ్యింది అని మరొకడు
ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు.. కొందరు ఆంధ్రా మిత్రులు నగరంతో ఉన్న పాత
అనుబంధాన్ని గుర్తు చేసుకుని విచారం వ్యక్తం చేస్తుంటే చాలా మంది మాత్రం తెలంగాణా ఏర్పడటంతోనే
ఈ ఉపద్రవం వచ్చిందనే విధంగా విషం కక్కుతున్నారు. అసలు మీ సమస్య ఏంటి.. నగరం మునిగితే
మీకు ఆనందంగా ఉందా.. లేక తెలంగాణా వచ్చిందనే అక్కసుతో ఇంకా కుతకుతలాడుతున్నారా..
అసలు హైదరాబాద్ ఇలా ఎందుకు
తయ్యారయ్యిందనే విషయం తెలుసుకునే తెలివి మీకుందా..
ఇప్పుడు పొంగిన చెరువులు,
నీటమునిగిన కాలనీలు తెలంగాణా వచ్చాక కొత్తగా పుట్టుకు వచ్చినవి కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనే
భాగ్యనగరం నాశనమయ్యింది.. ఆంధ్రా పాలకుల హయాంలోనే నగరం చుట్టూ భూములు చెరువులు ఆక్రమణలకు
గురయ్యాయాయి. సిటీలోని చెరువుల్లో సైతం ప్లాట్లు వెలిసాయి. వీటికి రిజిస్ట్రేషన్లు
చేసిందీ ఆంధ్రా ప్రభుత్వాలే.. ఏం అప్పుడు ఆంధ్రా పాలకులు గడ్డి పీకుతున్నారా.. అంతెందుకు
రెడ్డి ముఖ్యమంత్రి అయితే రెడ్లు, కమ్మ ముఖ్యమంత్రి అయితే కమ్మవాళ్ళు నగరం చుట్టూ భూముల్ని
మింగేయలేదా.. అప్పుడు లేదా పాలకులకు తెలివి.. అవును తెలంగాణ వచ్చింది అయితే మీకు ఇంకా
కడుపుమంట దేనికి.. మీ వాళ్ళు ఆక్రమించుకుని లేపిన ఆకాశ సౌధాలను నేల మట్టం చేయలేదనా? ఇప్పుడు నగరాన్ని ప్రక్షాళన చేయాలంటే సిటీ చుట్టూ
అక్రమంగా వెలసిన కాలనీలను నేలమట్టం చేయాలి అది సాధ్యమా.. అప్పుడు ఎన్ని ఆంధ్రా కుటుంబాలు
వీధిన పడతాయో తెలుసా మీకు. ఏదో చేతిలో ఫోన్ ఉంది కదా అని ఏదిపడితే అది రాసుకుని శునకానందం
పొందటమేనా. కొంచం కూడా సిగ్గుండక్కరలేదా.. ఎప్పుడూ పడనంత భారీ వర్షాలు పడ్డాయి ఎవరు
మాత్రం ఏం చేస్తారు. కేసీఆర్ దగ్గర ఏమన్నా మంత్రదండం ఉందా. చిన్న తూఫాన్ వస్తేనే చిగురుటాకులా
వణికి పోయే మీ నగరాల గురించి ఆలోచించండి ముందు. మీ జగన్, చంద్రబాబులు తూఫానులను ఆపేసి
మంత్రాలేమన్నా నేర్చుకున్నారా.. సిగ్గుండాలి పిచ్చి కూతలు కూయడానికి.. ఒకటి మళ్ళీ చెబుతున్నా
మా హైదరాబాద్ సర్వనాశనం అయ్యింది ఆంధ్రా పాలకుల హయాంలోనే.. ఇక్కడ చాలా మంది ఆంధ్రవాళ్లున్నారు
మేమంతా కలిసే ఉన్నాం, మునిగితే అందరం మునుగుతాం తేలితే అందరం తేలుతాం.. ఎక్కడో కూర్చుని విషం చిమ్మకండి..
కొందరు (ముఖ్యంగా అమెరికాలో ఉండేటి) ఆంధ్రోళ్లను జూస్తే బేగాని షాదీమే అబ్దుల్లా దీవానా అన్నట్టుంటది!
ReplyDeleteఈ పోస్టునూ తిడుతున్నారు. వాళ్ళ మానసిక పరిస్థితి అలా ఉంది.
Deleteమస్తు చెప్పినవ్ తమ్మీ !
ReplyDeleteఅసలు నా టైములైనులోగూడా (facebook) బోలెడన్ని విడియోలు, హైదరాబాదుకు కేసీయారు సారు సముద్రం తెస్తనన్నడు, తెచ్చిండు అని, ఓ రేంజి యెటకారాలు. డ్రైనేజి వ్యవస్త సరిగా లేదు, ప్లానింగ్ సరిగా లేదు అని చెబితే సరేలే నిజమే గదా చెబుతున్నరు అనుకోవచ్చు. కానీ, ఈల్ల యేడుపంతా వేరే రకంగా ఉండిపాయె ! మమ్మల్నే కాదు పొమ్మంటారా, "మీకు బాగా అయ్యింది" అనుభవించండి అన్నట్టుగా ఉన్నయ్ వాల్ల రాతలు.
హైదరాబాదుతో ఎన్నో యేల్ల అనుబంధం .. సొంతూరు లెక్క ఫీలవుతా నేనైతే ! (నేను 100% రాయలసీమ వాడిని, ఆంధ్రా అంటే నేను కూడా వస్తాను అని ఫీలవుతున్న వాడిని.)
మరీ ఆంధ్రా పాలకులే నాశనం చేసినరు అని ఆంధ్రావాల్లను అనడం కూడా నేనొప్పా ! ఎందుకంటే, హైదరాబాదే కాదు, చెన్నై కూడా అలానే తగలడింది, చాలా సిటీలు అలానే ఉంటున్నాయి... పట్టణాలలోకి వలసలు ఎక్కువవ్వడం, రియల్ ఎస్టేట్ల అడ్డగోలు వ్యాపారాల వల్ల ఇలాంటి ఉపద్రవాలు కొని తెచ్చుకుంటున్నాయ్. అంతెందుకు, తెలంగాణా మొదట్లోనే సపరేటు రాష్ట్రముగా ఉండి ఉన్నా.. హైదరాబాద్ పరిస్తితి ఇలానే ఉండేది అని నా ఫీలింగ్. నవాబుల కాలములో కూడా హైదరాబాదుకు వరదలు వచ్చిన సందర్బాలు ఉన్నాయి.
సో, బేసిగ్గా కొంత మంది ఏడుపుగొట్టు జనాలను యేడుపులు వదిలేసి.. సిటీ ప్లానింగ్, డ్రైనేజీ వ్యవస్త సరిగ్గా ఉండేలా ఇక మీదటైనా చర్యలు తీసుకుంటే బావుంటుంది అంతే. ఇప్పుడు వర్షాలు విపరీతంగా పడిండొచ్చు.. కానీ హైదరాబాదీల కష్టాలు.. గట్టిగా నాలుగు చినుకులు పన్నా విపరీతంగానే ఉంటున్నాయి. కాబట్టి, ఫైండ్ ఎ సొల్యూషన్ !
ఇక ఏడ్చేవాల్లు ఏడుస్తూనే ఉంటారు, ఆ క్రై బేబీస్ గురించి పట్టించుకోకండి. ఓ రెండు రోజుల్లో యధావిధిగా మళ్ళీ కళ్ళలో నిప్పులు పోసుకుంటారు.
అన్నా థాంక్యూ
Deleteమీ విశ్లేషణ చాలా బావుంది.
బహుశా,ఇది నేను
ReplyDeleteవిశ్వనగరమా నీవెక్కడా? పోష్టు దగ్గిర "ఆంధ్రావాళ్ళని దొంగలని తిట్టి సాధించుకున్న స్వతంత్ర రాష్ట్రం తిట్టడానికి ఎవరూ దొరక్క అస్వతంత్రం అయిపోయిందా!" అని వేసిన వ్యాఖ్యకి "అయ్యా మహానుభావా..
నేను ఆంధ్రా వాళ్ళని తిట్టినట్లు నాకైతే గుర్తు లేదు. మీకేమన్నా తెలిస్తే చెప్పండి పుణ్యముంటుంది. ఇక్కడ మీరొక విషయం గమనించాలి. హైదరాబాద్ లో ఇప్పుడు పొంగిన చెరువులు నీట మునిగిన కాలనీలు తెలంగాణా ఏర్పడిన తర్వాత పుట్టుకు వచ్చినవి కావు. ఆంధ్రా పాలనలోనుంచే నగరం ఆక్రమణలకు గురయ్యింది. అక్రమ నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లు ఇచ్చింది కూడా ఆంధ్రా పాలకుల ప్రభుత్వాలే.. ఏం అప్పటి పాలకుల తెలివి ఏమయ్యింది. వారి తప్పిదాలే కదా నేటి ఈ దుస్థితికి కారణం.." అని జవాబు చెప్పి అయినప్పటికీ ఆవేశం చల్లారక వేసిన పోష్టు కావచ్చును.
ఆంధ్రా అంటే నేనొక్కణ్ణే కాదు.తెలంగాణ అంటే మీరొక్కరే కాదు."లంకలో పుట్టినోళ్ళు అందరూ రాక్షసులే!ఆంధ్రాలో పుట్టినోళ్ళు అందరూ దొంగలే!" అనే మాటకి అర్ధం ఏమిటో మీరు చెప్పగలరా?అప్పుడూ ఇప్పుడూ కేసీయారు నుంచి జై గొట్టిముక్కల వరకు "ఆంధ్రోళ్ళు","దొంగలు" అనే పదాల్ని పర్యాయ పదాలు చేసేసి నిలదీస్తే "అబ్బే!అది జెనెరిక్ ఎక్స్ప్రెషన్.మా ప్రాంతాన్ని దోచుకున్న దొంగల్ని మాత్రమే తిడుతున్నాం" అన్నారు.మరి పైన నేను ఉటంకించిన వాక్యంలో ఆ సెపరేషన్ ఉందా?
ఒక్కసారి మీరు అక్కడ నాకు చెప్పిన జవాబులో ఉన్న తెలివితక్కువ తనం చూద్దామా సార్!
"ఆంధ్రా పాలనలోనుంచే నగరం ఆక్రమణలకు గురయ్యింది. అక్రమ నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లు ఇచ్చింది కూడా ఆంధ్రా పాలకుల ప్రభుత్వాలే.. ఏం అప్పటి పాలకుల తెలివి ఏమయ్యింది." అని మీరు అంటున్నది ప్రత్యేకించి ఏ దశాబ్దం గురించో మీకూ జై గారికీ క్లారిటీ ఉందా?
ఎందుకంటే, జై గొట్టిముక్కల లాంటి కుక్కలు మాటిమాటికీ "బాబోరు,సెంద్రాలు,పచ్చ రాజ్యం" అనే తెదెపా ఆవిర్భవించినది ఎప్పుడు?2014 తర్వాత గులాబీ కండువాతో కొత్త తెలంగాణ ప్రభుత్వంలోని చాలామంది మంత్రులు ముఖ్యమంత్రితో సహా ఒకనాటి పచ్చ కండువాలు వేసుకున్న వారే కదా!కేసీయార్ అయితే అప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన పార్టీ కార్యకర్తలకి రాజకీయ పాఠాలు కూడా చెప్పాడు.
అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గిర కాదు అన్నట్టు ఎవడికి చెప్తారు మీ తెలంగాణ విప్లవ చరిత్ర?
వెంగళ రావు గారి తర్వాత 1978 మార్చి 06 మొదలు 1980 అక్టోబర్ 11 వరకు మొదటి విడత ముఖ్యమంత్రిత్వం నిర్వహించిన మర్రి చెన్నారెడ్డి గారి అధ్వర్యంలోనే 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడిచింది.వికారాబాద్ నుంచి శాసనసభకు ఎన్నికై 1957–62 మధ్యన Public Accounts Committeeలో పనిచేశారు.రెండుసార్లు Estimates Committeeకి చైర్మనుగా పనిచేశారు.Andhra Pradesh Regional (Telangana) Development Committeeకి చైర్మనుగా పని చేశారు.1962లో తండూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యాక మొదట Planning, Panchayat Raj శాఖలతోనూ పిదప Finance, Commercial Taxes, Industries శాఖలతోనూ మంత్రి పదవిని అలంకరించారు.మళ్ళీ 1967ల నాడు కూడా శాసనసభకు ఎన్నికై Finance, Education, Commercial Taxes శాఖలతో మంత్రిత్వం అనుభవించారు.అప్పుడు రాష్ట్ర మంత్రిత్వం నుంచి తప్పుకుని కేంద్రంలో 1967–68 మధ్యన Steel, Mines, Metals శాఖలతో మంత్రిత్వం సంపాదించాడు. అన్నీ చేసి తీరా ఏప్రిల్ 1968న రాజీనామా చేసి వెంటనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారు!
మహా ఘనత వహించిన మర్రి చెన్నారెడ్డి గారి అధ్వర్యంలో నడిచిన తెలంగాణ ఉద్యమపు నీచత్వాన్ని తెలుసుకోవటానికి ఈ కొంచెం చరిత్ర చాలదూ!తను మంత్రిత్వం వెలగబెట్టిన కాలం నాడు జరిగిన అన్యాయం మీద తనే తిరగబడటం ఏమిటో అందులోని మోసం ఏమిటో ఇప్పటికీ తెలుసుకోలేని తెలంగాణ ప్రాంతపు మేధావుల అజ్ఞానం మీద నాకు జాలి వేస్తుంది.వాళ్ళ ఆజ్ఞానంతో ఇన్నేళ్ళూ వాళ్ళని వాళ్ళు సర్వనాశనం చేసుకున్నది చాలక వాళ్ళకన్న పదింతలు తెలివైనవాళ్ళైన ఆంధ్ర ప్రాంతపు ప్రజల్ని కూడా సర్వనాశనం చేశారు!
ఏమండీ!ఆంధ్రా దోపిడీ దొంగల పాలనని అంతం చేసుకుని ఎన్నేళ్ళయ్యింది?ఆ క్లారిటీ అయినా ఉందా మీకు?
మొదటి విషయం నేను మీ కామెంట్ కు స్పందించి పోస్టు రాయలేదు.. ఎందుకంటే మీ కామెంట్ కు అంత సీన్ లేదు.. రెండోది నేను ప్రాంతీయవాదిని కాదు. సమస్య ఇప్పటిది కాదు పాపం అందరిదీ అని చెప్పడమే నా ఉద్దేశ్యం. దయచేసి నాకు చరిత్ర నేర్పే ప్రయత్నం చేయకండి.
Deleteనేను పెట్టే పోస్టులు ఎక్కువగా fb లో వచ్చే పోస్టుల ఆధారంగా ఉంటాయి. మీరెందుకు గింజుకుంటున్నారో అర్ధం కావటం లేదు. కుక్కలు అనే పదం వాడారు. ఆ గొట్టిముక్కల గారు ఎవరో నాకు పరిచయం లేదు. ఎప్పుడో కామెంట్లలో చూడటం తప్ప. ఆయనను తిట్టాలంటే మీరు మీరు చూసుకోండి. న బ్లాగ్ వేదికలో ఇలాంటి పదాలు సంస్కారం కాదు. మరో విషయం మీరేమన్నా కేసీఆర్ కు వ్యతిరేకంగా కానీ హైదరాబాద్ వరదలపై గాని ఎక్కడైనా పోస్టు పెట్టారా.. అది నాకు తెలియదు.. మరి నా పోస్టుకు అంతగా ఎందుకు స్పందించారు. అంటే మీ ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయని అనుకోవాలా..
ఎందుకండీ ఇంతగా మాట్లాడుతున్నారు అన్నీ మీకే తెలిసినట్లు.. ఒకటి మాత్రం నిజం చెప్పారు తెలంగాణా వాళ్ళ కంటే ఆంధ్రావాళ్ళు పదింతలు ఎక్కువగా తెలివైన వాళ్ళు అని. అందుకేగా తెలంగాణా ఇలా తయారయ్యింది. ఏదైనా మనకే తెలుసు అనుకోవద్దు. తేదీలు ఉటంకించి చెప్పినంత మాత్రానా మీరేం చరిత్రకారులు అయిపోరు. దయచేసి సౌమ్యమైన భాష వాడండి.
Do you think "baegaanee shaadee man Abdullah deewaanee" is soumyamauna bhaasha, Mr. Manaswini shaik?
Deleteతేదీలు ఉటంకించి రాసింది చరిత్ర కాకపోతే సొల్లు రాసిన మీ పోష్టుకీ విలువ ఉండదు.
Deleteఒక అన్యాపదేశపు వ్యాఖ్యకీ తేదీలతో సహా ఎత్తి చూపించిన మీ ప్రాంతపు నాయకుల నిజమైన నీచపు చరిత్రకే అంత కోపం తెచ్చుకుని నన్నేదో పరిధులు దాటి ఆవేసపదినట్టు వెక్కిరిస్తూ నాకు పెద్ద సీను లేదన్నట్టు బిల్డప్ ఇస్తూ ఇంత ఆవేశపడిపోయారే,మరి అన్నేళ్ళు మమ్మల్ని దొంగలు అని నిరాధారమైన దుర్వ్యాఖ్యలు చేస్తే మాకు మండదా!
పౌరుషం,ప్రాంతీయాభిమానం మీకు మాత్రమే ఉంటాయా, ఉండాలా?
ఇప్పటికీ మీరు సైతం "తెలంగాణ ఇలా కావటానికి ఆంధ్రా వాళ్ళే కారణం" అంటున్నప్పుడు మరి మమ్మల్ని తిట్టినవాళ్ళనీ తిడుతున్నవాళ్ళనీ మానుషం గల ఏ ఆంధ్రావాడు అభిమానిస్తాడు, మిత్రులని భావిస్తాడు, పొరుగువాళ్ళని సహిస్తాడు?
WE ARE DOING JUST TIT FOR TAT!BARE IT OR BORE IT- EITHER WAY YOU ARE WELCOME, GOT IT?
అయ్యా సారూ.. ఇది టిట్ ఫర్ టాట్ సమయమా.. నగరం మునిగింది.. ఒకరికి ఒకరు చేయూతనిచ్చుకోవాల్సిన సమయమిది.. అలాకాకుండా వెకిలి పోస్టులు పెడుతున్నారు కొందరు.. అలాంటప్పుడు స్పందించకుండా ఉంటామా.. మీరెందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు. మళ్ళీ చెబుతున్నా మీ కామెంట్లకు స్పందించి నేను పోస్టులు పెట్టడం లేదు.. కొన్ని పోస్టులకు స్పందించి రాస్తున్నా.. మీరు ఇదైపోకండి.. నేను రాసేది సొల్లులా మీకు అనిపించవచ్చు. తప్పులేదు మనకు నచ్చనిది ఏదైనా సొల్లులా కనిపించడం సహజం మీరూ మనిషేగా.. ఇక సౌమ్యమైన భాష బెగానేకీ షాదీమే అబ్దుల్లా దివానా అనేది ఒక సామెత ఇది మాకు హైద్రాబాద్ లో కామనే.. మీకు తప్పు అనిపిస్తే ఏం చేయలేను. కనీసం కుక్కలు నక్కలు అనే పదాలు లేవు ఈ సామెతలో.. చేయాలనుకుంటే మంచి సూచనలు చేయండి అంతేగానీ ఈ తిట్టుకోవడాలు ఎందుకు?
Deleteహైదరాబాద్ ఇలా తయారు కావడానికి ముఖ్యమైన కారణం అవినీతి!
Deleteదానికి ముఖ్యమైన కారణం కేసీయార్!ఉద్యమ నేపధ్యంతో అధికారంలోకి వచ్చిన మొదటి రోజునుంచీ అవినీతికి లాకులు ఎత్తేశాడు!మీలాంటివాళ్ళు ఇప్పటికీ "తెలంగాణ ఇలా కావటానికి ఆంధ్రవాళ్ళే కారణం" అనుకుంటున్నారు, అదే అతనికి పెట్టని కోట అయ్యింది.చెడు ఏదన్నా కనబడితే పాత్ ఆంధ్రోళ్ళ దోపిడి పాలన ఫలితం అంటాడు.మంచిని మాత్రం సమస్తం నాదే అంటాడు.ప్రతిపక్షం లేదు.మీడియాని మైహోం బామ్మర్ది చేత కొనిపించేశాడు.సెక్రటేరియట్ వాస్తు బాగాలేదని అన్నప్పటికీ చెల్లిపోతుంది.మూసీనదిని శుభ్రం చేస్తానని సగం పని చేసి ఆపేసినా ఎవడూ ఏమీ అనడు.అస్మదీయ కాంట్రాక్టర్ల గిట్టుబాటు కోసం మొదలుపెట్టి లాభం పూర్తయ్యాకో లాభం గూబల్లోకి వస్తుందనో ఆపేసి ఉంటాడు!
ఒక నల్లా దగ్గిర ఏదో ప్రమాదం జరిగిందని నల్లాల వ్యవస్థ మొత్తాన్ని చిందరవందర చేశాడు.అంటే అన్నానని గింజుకుంటున్నారు గానీ ఒకసారి గుర్తు చేసుకోండి దాదాపు ప్రతి సంవత్సరమూ వర్షాకాలం ఇలాగే నడుస్తున్నది కదా!టీవీలో చూస్తూనే ఉన్నాం కదా వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాదు ముంపు ప్రాంతాల ప్రస్తావన లేకుండా వార్తలు పూర్తవుతున్నాయా!
నేను ఉద్యమ సమయంలో మీ ముఖ్యమంత్రిని "కచరా!" అని అనేవాణ్ణి.కానీ, అతను ముఖ్యమంత్రి అయ్యాక మానుకున్నాను - అతని స్థానం చుట్టూ ఉన్న గౌరవ ప్రపత్తులను గమనించి.కానీ,పైన ఉన్నాడే జై గొట్టిముక్కల అని అతను ఇప్పటికీ చంద్రబాబుని "బాబోరు,చంద్రాలు,పచ్చనేత" అంటుంటాడు - ఆంధ్రాకి 46 వేల కోట్ల ముద్దాయి ముఖ్యమంత్రి అయినందుకు అతనికి ఎంత ఆనందమో!మిగులుని మీకిచ్చి లోటుని మేం తీసుకుని రాజధాని లేకుండా విడిపోయిన మమ్మల్ని చూస్తే అతనికి ఎంత శాడిస్టు ఆనందమో!
విడిపోయాక నేను గానీ మరొక ఆంధ్ర ప్రాంతం వాడు గానీ ఏనాడూ తెలంగాణలో కేసీయార్ అంత అరాచకం చేస్తున్నా ఒక్క నెగటివ్ కామెంట్ వెయ్యలేదు.కానీ, అతను మాత్రం తెల్లారి లేచి బ్లాగుల్లోకి వస్తే మొత్తం అన్ని కామెంట్లూ ఆంధ్రా గురించే - మా నాయకుల మీద విషం కక్కడం, మా రాష్ట్రం అప్పులు కూడా పుట్టననత చంక నాకిపోతే అదే గొప్ప అభివృద్ధి అన్నట్టు మాకు బాబు కన్న జగనే బెస్టు అంటూ ఉచిత బోడి సలాహాలు ఇవ్వడం!
అటువంటివాళ్ళు మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నారో మీకు తెలియదు.అక్కడ వాడిన సామెత మామూలుదే, కానీ వాడిన మనిషి యొక్క ఆంధర్ద్వేషం వల్ల మాకు అది బూతుతో సమానం!
భారీ నష్టం జరిగితేనే కదలిక పుడుతుందా ప్రజల్లో కూడా - మరీ ఇంత మొద్దు నిద్ర పోతే ఎట్లాగండీ!ఇప్పుడు ఒక్కసారి ఆవులించి లేచి ప్రయోజనం లేదు.ఈ ఒక్క వరద చాలా వరదల్ని మోసుకొస్తుంది.వరద తగ్గేలొపు పాత ఇళ్ళు నానిపోయి తర్వాత కూడా తిరిగి ఆ ఇళ్ళలోకి వెళ్ళడం ప్రమాదం అంటున్నారు నిపుణులు.ఒక రకంగా చెప్పాలంటే మొత్తం హైదరాబాదుని పునర్మించాల్సిన పరిస్థితి,ఆలోచించుకోండి.ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నది ఆదర్శవంతుదైన ప్రజాసేవకు కంకణం అక్టుకున్న ప్రకాశం పంతులు గారు కాదని తెలుసుకుని హెచ్చరికగా ఉండండి!
సిటీ ప్లానింగు మార్చడం,అక్రమ కట్టడాల్ని, అంటే చెరువుల్ని కబ్జా చెయ్యడాన్ని ఆపటం ఒక్క రోజులో జరిగే పని కాదు.అవి ఆగను కూడా ఆగవు.ఒకసారి అవినీతికి అలవాటు పడినవాళ్ళని ఇప్పటి ప్రమాదం ఏమాత్రం మార్చలేదు.ఇదే కాదు, ఇంతకి పదింతలు భీబత్సం జరిగినా ఒక నాలుగు రోజులు హడావిడి చేసి జనాన్ని మభ్యపెట్టి పరిస్థితి అదుపులోకి రాగానే మళ్ళీ పాత అవినీతినే కొనసాగిస్తారు.ప్రజలు, అంటే మీరు అన్నింటినీ వెయ్యికళ్ళతో కనిపిపెట్టి నిలదీస్తే తప్ప వాళ్ళలో చలనం రాదు.
కేసీయార్ ఇలాంటప్పుడు ఒక్కసారి తనంత మంచోడు లేడన్నట్టు డైలాగులు చెప్పేది చాటుమాటున అసమదీయులకి జనం వల్ల నష్టం జరక్కుండా చూసుకోవడానికే - ట్రిక్కులు ప్లే చెయ్యడంలో మహానేర్పరి.
సర్ మీ సుదీర్ఘ విశ్లేషణ అర్ధ చేసుకుంటున్నాను. కానీ ఒక విషయంలో మాత్రం విభేదిస్తా.. కేసీఆర్ సుద్దపూస కాదు నాకూ తెలుసు. తెరాస వర్గీయుల అవినీతి అరాచకాలు కూడా తెలుసు. తను మహాత్ముడిని నేనెప్పుడూ అనలేదు. కానీ నగరం ముంపుకు గురికావడానికి కేసీఆర్ ను మాత్రమే బాధ్యుడిని చేయలేం. అవినీతి ఇప్పుడు కొత్తగా పుట్టుకు వచ్చింది కాదు. మొదటినుంచీ ఉన్నదే. ఆ పాప ఫలితమే ఇది.. ఇక వ్యక్తిగత దూషణలు అంటారా నేను ఎప్పుడూ అలా చేయను. నాకా అలవాటు లేదు. నాకు ఆంధ్రా ప్రజలంటే చాలా అభిమానం. అక్కడ నాకు చాలా మండి మిత్రులున్నారు. అక్కడి రాజకీయాలు నాకు అనవసరం. మీరు ప్రస్తావించారు గనుక ఒకటి చెప్పకుండా ఉండలేను ఆంధ్రాకి జగన్ ఒక శాపం. ఎవరికీ కోపం వచ్చినా ఇదే నా అభిప్రాయం. ఇక ఇక్కడి విషయానికి వస్తే నేను తెరాస వ్యతిరేకిని. నిజానికి నేను ఏ పార్టీని అభిమానించను.. ఈ ఎన్నికల ప్రజాస్వామ్యంపై నాకు నమ్మకం లేదు. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ కు సంబంధించిన విషయంపైనే స్పందించాను తప్ప నేను ఏ పార్టీకి తొత్తును కాదు.
DeleteThanks!Yes, Corruption is not new.It is in the 1980's as somebody labels as TDP rule, and It is in Nehruvian time, as somebody labels as CONGRESS rule, and it is in NIJAM's Rule.And it is in MAURYA and GUPTA rules also:-)
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteసౌమ్యమైన భాషలోనే అడుగుతున్నాను. విశ్వనగరమా నీవెక్కడ అని మీరే వ్రాసి,అందుకు వ్యతిరేకంగా తదుపరి పోస్టు ఎందుకు వ్రాసారు ?
ReplyDeleteనీహారిక గారూ ఆవేదన వ్యక్తం చేయడం వేరు. నిందించడం వేరు. ఈ విపత్తుకి తెలంగాణా ఏర్పడటమే కారణం కాదు కదా ఇక్కడ అందరూ దొంగలే.. ఇప్పుడు కేసీఆర్ స్థానంలో జగన్ ఉన్నా ఇదే జరిగేది.. కాదని అంటారా.. తెలంగాణా ఏర్పడటానికి హైద్రాబాద్ munagadaaniki ఏమన్నా సంబంధం ఉందా..
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteవందశాతం నిజం 🙏
Deleteజగన్ ఆంధ్రాకు శాపం అనో తెరాస నచ్చదనో అనటం అవసరం కాదేమో నుండీ. వాళ్ళని ప్రజలు పొలోమని ఓట్లు వేసి గెలిపిచారు. వారి వారి పాలనలు బాగుంటే ప్రజలకు మంచి జరుగుతుంది, ఆయా నాయకులకూ పార్టీలకు మేలు జరుగుతుంది. ఐతే ప్రజలు చక్కగా ఆలోచించ గలిగితే నే ఈ ఊహకు విలువ. ప్రజలు కూడా ప్రలోభపడ వచ్చు లేదా పొరబడవచ్చు అన్నదీ ఆలోచనీయమే. చూద్దాం, కాలం ఏం తేలుస్తుందో మరి.
ReplyDeleteఅంతేలే సార్...
Delete