తిరిగిరానిగతమే మనం
ఎవరికి తెలుసు
ఏ ఘడియ అంతిమమో
ఎవరు చెప్పగలరు
ఏ కన్నుల వెలుగు ఎప్పుడు ఆరునో
ఇప్పుడున్న క్షణం
మరుక్షణం మనది కాదేమో
ఇప్పుడు చూస్తున్న వైభవం
ఏ ఘడియన కుప్పకూలునో
నేడే మనది
రేపు మనది కానే కాదేమో
జీవించు నేడే
రేపటికోసం ఎదురుచూడకు
ప్రభవించు నేడే
రేపు వాడిన కుసుమమై నిలిచిపోదువేమో
నీవైనా
అది నేనేనైనా
రేపనేది చూస్తామో
తిరిగిరాని గతమై మిగిలిపోతామో
ఎవరికి తెలుసు
మనస్వినీ
No comments:
Post a Comment