శ్రీమంతుడినే నేను
మనసును మంజీరంలా పులకింపజేసే
నీ అనురాగం
ఒక శిఖరంలా నిలిస్తే
సిరిసంపదలను తలదన్నే నీ మానసం
నాకు ఆసనమై మురిపిస్తే
పండువెన్నెలను మరిపించే
నీ నయనాల వెలుగురేఖలు
కాగడాలుగా అడుగులు నేర్పితే
మేఘమాలికల విద్యుల్లతలు
నీ పెదాల పలుకుల్లో జాలువారితే
అంతఃపురం జిలుగులు
నా శయనమందిరంలోనే విరాజిల్లితే
ఇంకా ఏం కావాలి నాకు
సిరిసంపదల జిలుగుల్లో
కరెన్సీ కట్టల పరుపుల్లో
నా మనసు పులకించేనా
అనురాగ శిఖరమై నిలిచిన నీవు
అనుబంధానికి ఆలవాలమై వెలిగిన నీవు
కలకాలం తోడు నిలిస్తే
నన్ను మించిన శ్రీమంతులు ఎవరున్నారు
నాయింట నడియాడే నీవే
నాకు అమూల్యమైన
సిరిసంపదవు కాదా
మనస్వినీ
No comments:
Post a Comment