నవవసంత
సంకేతం
శతకోటి తారకలు ఒక్కసారిగా
నేలవైపు రాలుతున్న సంభ్రమం
ఎండిన మైదానంపై
గోదారమ్మ ఎద పరిచిన అనుభూతి
ముడుచుకున్న మల్లియ
అప్పుడే విచ్చుకున్న అనుభవం
చీకటి తెరపై తారకలను అద్ది
దీపాలుగా అమర్చిన చందం
తెరలు తెరలుగా గుభాళింపులేవో
మనసు పుటాలను తాకిన వైనం
బోసినవ్వుల పాప గుండెనిండా
కేరింతలు వేసిన దృశ్యం
అవును
ఇది నీ నవ్వుల మహత్యం
నిన్న రాతిరి
వంటినిండా గిలిగింతలు పెట్టినట్లు
మెలికలు తిరుగుతున్న
పిల్లనదిలా
కొండగట్టు నుంచి జారిపడే నీటిపాయలా
నువ్వు రువ్విన నవ్వుల జల్లులు
నవవసంతానికి సంకేతం కాదా
మనస్వినీ
No comments:
Post a Comment