జీవిస్తూ మరణించనీ
చీకటమ్మ గదిలో
కన్నుల వెన్నెల దీపాలు వెలగనీ
తపన తీరని దేహాల రాపిడిలో
విద్యుల్లతలు జనియించనీ
చిరుగాలికే వణుకుతున్న దీపానికి
చెమటగంధమే ఇంధనంగా మారనీ
శీతలపవనం తాకిడిలో
వణుకుతున్న పెదాలకు
వెచ్చని ఊపిరినే సాంత్వనగా మారనీ
దాహార్తితో ఎండిన గొంతుకను
బింబాధర అమృతాన్ని తాగనీ
ఎగసిపడుతున్న పరువాలను
మగసిరి ఎదలో తలదాచుకోనీ
చినుకు చుక్కకు దాసోహమైన మనసును
కురుల మేఘాలనీడలో వర్షించనీ
జీవనమో అది మరణమో
తెలియదు గాని
ఓషో చెప్పినట్లు
నిత్యం జీవిస్తూ మరణించనీ
మనస్వినీ
No comments:
Post a Comment