రాయడం రాదు నాకు
కవితలు నేను రాయలేను
అక్షరాలతో ఆడుకోలేను
భావాలుగా మలుచుకోలేను
ఏదో రాయాలనీ
అందరి మెప్పుపొందాలనీ
పదాలను అల్లుకోలేదు
రాయడమే రాదు నాకు
అక్షరమాలలు తెలియదు నాకు
ఎప్పుడు రాసానని కవితలు
ఎప్పుడు చెప్పానని భావాలు
నా రాతలు నావి కానే కావు
నా భావాలు నావి కానే కావు
నీ పెదాల జారిన పలుకులనే ఏరుకున్నా
నీ కన్నులవెన్నల భావాలనే పదిలం చేసుకున్నా
నీ నవ్వులో ముత్యాలను దోసిట పట్టుకున్నా
నీ పరువంలోని సరాగాలను తడిమిచూసుకున్నా
నీ గుండెలోతులను తొంగిచూసుకున్నా
నీ అనురాగంలో మమతలను వెతుక్కున్నా
నీ ఆవేశంలో అగ్నికణికలకు నివురులా రగిలినా
రాలిపడిన అగ్ని శిఖలకు గుండెను పరిచినా
నాదన్నది ఏమున్నది నా రాతల్లో
అన్నీ నీ కదలికల్లో
జారిపడిన అక్షరకుసుమాలే కదా
మనస్వినీ
No comments:
Post a Comment