తేనీయపువ్వులు
తొలి పరిచయం
అది ఒక మధుర సంతకం
ఆ జ్ఞాపకాల దొంతరలు
ఇంకా
మదిలో సుడులుగా
తిరుగుతూనే ఉన్నాయి
ఆ అనుభవాల పువ్వులు
మనో సీమలో నిత్యం
వికసిస్తూనే ఉంటాయి
నాకు బాగా గుర్తు
ఆ ఘడియలు
ఒక్క క్షణం కూడా
గడిచినట్టు లేదు
నిత్యం సజీవంగానే ఉంది
ఆ అనుభవం
తొలి స్పర్శతో మోములో
మారిన రంగులు
ఇంధ్రధనుస్సును
మరిపించలేదా
అటువైపు తిరిగిన
నువ్వు
వణుకుతూనే విచ్చుకున్న
నీ అధరాలు
మరువగలనా ఆ అనుభూతిని
ఆకురాలే కాలం పారిపోయి
నవవసంతం స్వాగతం
పలికినట్లు
ఎండమావులు కరిగి
హిమనీదాలు పొంగినట్లు
ఎలా మరువగలదు మనసు
ఆ కన్నుల వెన్నెలని
మనసు పంచిన మమతలని
జీవనయాన గతిని మార్చిన
ఆ తొలి సంతకపు ఆనవాళ్ళు
సదా నా మనసులో
తేనీయపువ్వులుగా
పరిమళిస్తూనే ఉంటాయి
మనస్వినీ
No comments:
Post a Comment