విలపించక మానవు
పులకించకు మనసా
విలపించక మానవు
కురిసే అమృతధారలు
మురిపించే పన్నీటి జల్లుల్లు
తాత్కాలికం కాక మానవు
కలిమిలో నీవున్నా
జేజేలు కొట్టేరు
లేమి నిన్ను ఆవరించినా
గడ్డిపోచగా చూసేరు
రవ్వంత మేలు చేసి
కొండంత చెప్పేరు
నవ్వులు చిందించకు మనసా
పెదాలు వాడిపోక మానవు
నవ్వులు పూసిన చోటే
ముళ్ళు గుచ్చక మానవు
అగ్ని ధారలు కురిసినా
వెన్నెల స్నానాలు ఆడినా
ఒకేలా ఉండు మనసా
పులకించకు మనసా
విలపించక మానవు
No comments:
Post a Comment