మధుపాన ప్రియుడినే
కైపులో తేలిపోయే
మధుపాత్రల నయనాలు
నిత్యం నాపై మధువులు
కురిపిస్తూ ఉంటే
మధుపానప్రియుడిని కాక
మరేమవుతాను
మత్తును సేవించే
చిత్తమెందుకు నాకు
నడియాడే మధుశాల
నా చెంతనే ఉండగా
జవరాలి కన్నులు
మత్తును గొలిపే
నిండుకుండలు
కన్నుల కొలనులో
చుక్కలుగా జారిపడే సుర
బిందువులు
తడియారిన మనసును
కవ్విస్తూ ఉంటే
నా అడుగులు తడబడవా
పలుకులు మత్తుగా
సోలిపోవా
బింబాధర రసగుళికలు
కన్నుల కైపులు
అన్నీ కలగలిపి
ప్రతి ఘడియా నన్ను
మధుశాలలో
ముంచివేయవా
క్రీగంటి చూపులో
పెదవి విరుపులో
మేని తళుకులో
జాలువారేది నీ మధురసాల
మధు వర్షంలో
నిత్యం తడిచి
మళ్ళీ మళ్ళీ తడవాలని
తపించే నేను
మధువుకు దాసుడినే కదా
మనస్వినీ
No comments:
Post a Comment