నీడ
ఒక చేతిలో చిద్విలాసంగా వెలుగుతున్న సిగరెట్టు
మరో చేతిలో గుండెనిండా తూటాలతో
రాజసం ఒలకబోస్తున్న రివాల్వర్
కళ్ళలో ఎక్కడలేని పొగరు
అవును నాకేంటి
మనసునిండా అహంకారం
అహంకారం మూర్తీభవించిన నేను
ఎవరికీ అపకారం చెయ్యలేదు
నేనూ నా మనసు
మనసు చెప్పిన మార్గంలోనే పయనించా
మనసు చెప్పిందే విన్నా
మనసు మాటలే ఆచరించా
నేను అన్న భావాన్ని విడనాడి
నేనే అని వ్యవహరించా
నన్నెవరు ఏం చెయ్యగలరు
నన్నెవరు చంపగలరు
భ్రమల్లో మునిగిపోయా
అందరికీ మంచి చేసా
ఎవరు మాత్రం నన్నేం చేస్తారు అంటూ
కలల పందిర్లు అల్లుకున్నా
ఒకటి మాత్రం మరిచిపోయా
నా వెన్నంటే ఒక నీడ ఉందనీ
ఆ నీడ చేతిలోనూ తుపాకి ఉందని
నీడ తుపాకి పేలుతుందని తెలుసుకోలేకపోయా
ఆ నీడకూడా నా పిచ్చిమనసే కదా
మనస్వినీ
No comments:
Post a Comment