కురిసే నవ్వులపువ్వు
ముద్దబంతిలా నవ్వులు కురిపిస్తావా
పచ్చనితోటనై నేను పరుచుకుంటా
కంటి వెలుగువై నీవు వెలుగుతావా
కన్నీటి చుక్కనై నేను రాలిపడతా
వెన్నెలవై కురిసిపోతావా
నల్లని చీకటినై నేను కరిగిపోతా
శ్రావ్యమైన గీతమై పలకరిస్తావా
నీ పాటకు పల్లవినై మిగిలిపోతా
చిరుదివ్వెలా దారి చూపుతావా
దీపం కింద చీకటిలా ఉండిపోతా
కాగడాలా నీవు నడుస్తావా
నీకు నీడనై
నీ అడుగులకు జాడలుగా
తోడు నడుస్తా
ఒక కలగా నీవు కరిగిపోతావా
ఒక గతంలా నేను మాయమవుతా
మనస్వినీ
No comments:
Post a Comment