కూడలి
ఒకవైపు అవమానం
మరోవైపు ఆవేదన
ఇంకోవైపు ఆక్రందన
చివరివైపు మరణం
అన్నీ కలగలిపి మరణమే
కూడలిలో నిలిచిన మనసుకు ఏది మార్గం
నాకు తెలుసు ఎటు అడుగులువేయాలో
ఏ గమ్యాన్ని చేరాలో
ఏ తీరాన్ని ముద్దాడాలో
గమ్యం తెలుసు
లక్ష్యం తెలుసు
తీసుకోవాల్సినది నిర్ణయమే
నా నిర్ణయాలపై అందరికీ అనుమానమే
నా పనులతో మిగిలేది అవమానమే
ఇప్పుడు అలా కాదు
మనసు స్థిమితపడింది
గుండె కుదుటపడింది
జరిగేదీ
ఒరిగేదీ
ఏమీ లేదని తెలుసు
మనసుకు విలువ ఇవ్వని లోకంలో
మనసుకు స్థానం లేదు
నిజాయితీకి ప్రామాణికత పక్షపాతమే
నాకు తెలుసు నేను
ఎవరికీ తెలియకపోతే నా తప్పు కాదు
ఎవరి అవార్డులు
మరొకరి రివార్డులు నాకెందుకు
నా ఆలోచనలకు అందని అర్థాలు ఎందుకు
అన్నీ తెలుసు మనసుకు
అలుముకున్న నిర్లిప్తతతో
ఇప్పుడు అడుగులు వేస్తోంది మనసు
Good
ReplyDeleteMani Teja