అంతుచిక్కని గమ్యం
నిశి వీధుల్లో విధి శోధనా
ఇది
అలికిడి లేని తొలకరి వెలుగుల
నిరీక్షణా ఇది...
ఎక్కడికి ఈ దారి తెలియని
పయనం
అడుగుజాడలు ఎక్కడ జారిపోయాయో
తెలియని వైనం...
అలసిన అడుగులకు కీచురాళ్ళ
సాయం
ఎక్కడో తెలియని తీతువు
పిట్టల గానం...
కళ్ళకు ఆనని వెండి వెన్నెల
సొబగులు
రారమ్మంటూ చీకటమ్మ పిలుపులు...
ఎక్కడుంది మనసా అంతుచిక్కని
గమ్యం
ఆగిపోదేమి ఈ పయనం...
No comments:
Post a Comment