నాకు నేనే ప్రత్యేకం
నాతో నేను గడిపే ప్రతి
క్షణం నాకెంతో అమూల్యం
నాతో నేను చెప్పుకునే మాట
నాకో సందేశం
నాపై నేను వేసుకునే ప్రశ్న
నాకెప్పటికీ ఒక గుణపాఠం
నా పెదాలపై విరిసే చిరునవ్వు
అది అంతులేని రహస్యం
నా కనుల జారే జలపాతం
నాకు ఎప్పటికీ స్వయంకృతాపరాధం
అందుకే నేను ఎందరిలో ఉన్నా
నాతో నేను ఉండాలనే ప్రయత్నిస్తా
ఎందుకంటే
నాకు నేను ఏంతో ప్రత్యేకం...
No comments:
Post a Comment