నువ్వే ఎందుకు కాకూడదు?
నా మనసును శ్రద్ధగా చదవాలి
నా మాటలను ఓపికగా వినాలి
నా ఆలోచనలను లోతుగా గ్రహించాలి
నన్ను తెలుసుకునేందుకు
నా అంత పైకి ఎదగాలి
నేను పడిపోతే కిందకు దిగి
పలకరించాలి
నన్ను నాకోణంలో చూసి నన్ను
తెలుసుకోవాలి
నాకొక నేస్తం కావాలి
మానవ మాత్రులకు ఇది సాధ్యం
కాదు
దేవుడా నా నేస్తం నువ్వే
ఎందుకు కాకూడదు?
దేవుడు ఇప్పటికే మీ నేస్తం. ఎప్పటికీ నేస్తమే.
ReplyDelete