Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday, 19 October 2020

కేసీఆర్ దే తప్పేమో...

 

కేసీఆర్ దే  తప్పేమో...


ఎవరో ఆవారాగాళ్ళు అంటున్నారంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఇక్కడ తిండి తిని ఇక్కడే బతుకుతూ ఇక్కడి విపత్తుపై కుళ్ళు కామెంట్లు చేస్తున్న కొందరు ఆంధ్రా  ప్రముఖులను చూస్తుంటే ఒళ్ళు మండిపోతోంది.. వాడెవడో బ్రహ్మాజీ అంట బతికేది ఇక్కడే, సంపాదనా ఇక్కడే.. హైద్రాబాద్ మునిగిపోతే కుళ్ళు జోకులేస్తున్నాడు.. తనవంతు బాధ్యతగా చేయూతనివ్వాల్సింది పోయి పడవ కొంటా అంటాడు. అంత  బలుపు ఉంటే ఓ నాలుగు పడవలు కొని హైదరాబాద్ పోలీసులకు ఇవ్వొచ్చుగా.. ఇంకోడేమో కేసీఆర్ వల్లే నగరం మునిగింది అంటున్నాడు.. ఓ గాలి మనిషేమో హైదరాబాద్ ఇప్పుడు సేఫ్ కాదని అంటున్నాడు. ప్రతి అడ్డమైనోడు హైద్రాబాద్ దుస్థితిపై మానసిక వికారం బయటపెట్టుకుంటున్నాడు...మళ్ళీ మళ్ళీ చెబుతున్నా  హైద్రాబాద్ ఈ దుస్థితికి చేరుకోడానికి ఆంధ్రా పాలకులే కారణం. అసలు 1990 ప్రారంభం నుండే నగరంలో ఆక్రమణలు ఊపందుకున్నాయి. ఓ నేదురుమల్లి, ఓ కోట్ల ఒక ఎన్ టీ ఆర్, ఓ వైయస్సార్, ఒక చంద్రబాబు... వీళ్ళ హయాంలోనే ఎక్కువగా నాలాలు, చెరువులు కబ్జాకు గురయ్యాయి. అక్రమాలపై ఏ ప్రభుత్వమూ స్పందించలేదు. పైగా రిజిస్ట్రేషన్లు కూడా చేసి ఇచ్చారు. మరి ఈ టైం లో ఘనత వహించిన మజ్లిస్ పార్టీ ఏం చేసిందబ్బా అని అడగొచ్చు... చాలా చేసింది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరింది ఇప్పటిలాగానే.. మరి కేసీఆర్ కూడా అప్పట్లో ప్రభుత్వంలో భాగంగా ఉన్నాడు కదా అంటే నిజమే.. ఏమన్నా చేసే బలం ఉందా అప్పుడు కేసీఆర్ కి.. సరే తెలంగాణా  వచ్చాక ఏమన్నా మారిందా అంటే లేదు.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. ఆక్రమణలను తొలగించటం ఎవరికీ సాధ్యం కాని పరిస్థితికి చేరుకుంది నగరం.. ఇప్పుడు ఆంధ్రా మేధావులు చేస్తున్న కామెంట్లను చూస్తుంటే కేసీఆర్ ఒక తప్పు చేసాడని ఒప్పుకోక తప్పదు. తెలంగాణా ఉద్యమసమయంలో కేసీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఆంధ్ర వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, ఆ ప్రాంతానికి చెందిన నాయకులపై తరచుగా విరుచుకుపడేవారు. తెలంగాణా వస్తే ఏదో ఉపద్రవం తప్పదని ఈ వర్గాలు భయాందోళనలకు గురయ్యాయి. కానీ అధికారంలోకి రాగానే కేసీఆర్ వీరందరికి పెద్ద పీట వేశారు. సినిమా రంగానికి పెద్దన్నగా ఉంటాననని హామీ ఇచ్చారు. ఇదే ఆయన తప్పేమో.. తెలంగాణా వ్యతిరేకులపై ఆయన కక్ష సాధించలేదు. అదే చేసి ఉండాల్సిందేమో.నగరం చుట్టూ అనేక పరివాహక ప్రాంతాలు, చెరువులను ఎంతమంది ఆంధ్రా పెద్దలు ఆక్రమించలేదు. సాక్షాత్తు ఆంధ్ర ముఖ్యమంత్రి ఫామ్  హౌస్ కట్టుకున్న విషయం మరిచిపోవద్దు. సినిమా ప్రముఖులు చెరువులను కబ్జా చేసిన ఉదంతాలు కాదనలేనివా.. కేసీఆర్ వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం తప్పే.. అనేకమంది ఆంధ్రా ప్రముఖులు ఇక్కడ కబ్జాదారులు... వీరినీ  కేసీఆర్ టచ్ చేయలేదు ఇదీ తప్పే... చెరువుల్లో వెలసిన కట్టడాల్లో వందలాది నిర్మాణాలు ఆంధ్రా వాళ్ళవే.. వీటిని కూడా కేసీఆర్ కదపలేదు అబ్బా కేసీఆర్ ఎన్ని తప్పులు చేసాడు. అందుకే నగరం మునిగిపోవడానికి కేసీఆర్ కారణమయ్యాడు.

అందుకేనేమో హైద్రాబాద్ మునిగిపోతే వికారమైన కామెంట్లు పెడుతున్నారు.

నిజానికి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రా ముఖ్యమంత్రి ఉన్నా ఇదే పరిస్థితి ఉండేది. వంద ఏళ్లలో ఎప్పుడూ లేనంత వర్షం కురిస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు. ఇవన్నీ తెలిసికూడా పిచ్చికూతలు కూస్తున్న ఆంధ్రా ప్రముఖులు కొందరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోవడం బెటరేమో.. ఇక్కడ సామాన్యులైన ఆంధ్ర సోదరులు ఆనందంగానే ఉన్నారు. అందరం మునుగుతున్నాం అందరం తేలుతున్నాం.సాధ్యమైతే చేయూతనివ్వండి.. బాధితులకు అండగా నిలవండి. లేకపోతే నోర్మూసుకుని కూర్చోండి.  గుట్టల మీద బంగ్లాల్లో కూర్చుని కామెంట్లు చేస్తున్న వెధవలు యస్ వెధవలు అనే పదాన్నే వాడుతున్నా సొంతూరికి షిఫ్ట్  అవ్వడం మంచిది.

వాళ్ళ సినిమాలు, వాళ్ళ వ్యాపారాలు ఇక్కడ లేకపోతే మాకు వచ్చే నష్టం ఏమీ లేదు..

6 comments:

  1. దేశం మొత్తం మీద ఎలా ఎన్నికలు జరుగుతాయో తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ అలాగే జరుగుతాయి కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యుల్ని తెలంగాణ వోటర్లే ఎన్నుకుంటారు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యుల్ని ఆంధ్రా వోటర్లే ఎన్నుకుంటారు కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు ఆంధ్ర ప్రాంతపు అభివృద్ధి కోసం పనిచెయ్యరు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యులు తెలంగాణ ప్రాంతపు అభివృద్ధి కోసం పనిచెయ్యరు కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు ఆంధ్ర ప్రాంతపు అభివృద్ధిని అడ్డుకోలేరు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యులు తెలంగాణ ప్రాంతపు అభివృద్ధిని అడ్డుకోలేరు కదా!

    ReplyDelete
  2. ఈ గోలంతా కాకుండా.. ముంపుప్రాంతాలన్నీ లెక్కదీసి, ఆంధ్రావాల్లు ఎక్కడెక్కడున్నారు, తెలంగాణావాల్లు ఎక్కడెక్కడున్నారో లెక్కతేలిస్తే... ఆంధ్రా దొంగలెంతమందో, తెలంగాణా దొంగలెంతమందో లెక్కతేలదా!

    ReplyDelete
    Replies
    1. సామాన్యులు ఏం పాపం చేశారండీ.. వారు ఏ ప్రాంతీయులైనా ఇక్కడి పౌరులే కదా

      Delete
  3. 'బాధితులకు అండగా నిలవండి. లేకపోతే నోర్మూసుకుని కూర్చోండి. గుట్టల మీద బంగ్లాల్లో కూర్చుని కామెంట్లు చేస్తున్న వెధవలు యస్ వెధవలు అనే పదాన్నే వాడుతున్నా సొంతూరికి షిఫ్ట్ అవ్వడం మంచిది.వాళ్ళ సినిమాలు, వాళ్ళ వ్యాపారాలు ఇక్కడ లేకపోతే మాకు వచ్చే నష్టం ఏమీ లేదు..' - వాళ్ళంతట వాళ్ళు పోరండి,మీరు తన్ని తగిలెయ్యాల్సిందే.ఈ పని మీరు ఎంత త్వరగా చేస్తే అంత మంచిది.సొంత రాష్ట్రం ఒక సైకో పాలనలో మగ్గుతుంటే ఒక్కడు నోరెత్తడు గానీ దయదల్చి ఇంకా వాళ్ళని హైదరాబాదులో ఉండనిస్తున్న కేసీయారు మీద వ్యంగ్యాలా!

    ReplyDelete
  4. అందరినీ అనటం లేదండీ.. కొంతమంది నోరుపారేసుకున్నవాళ్లనే... మానవత్వాన్ని చూపుతున్నవాళ్లూ ఉన్నారు.. వారికి నా 🙏

    ReplyDelete