అగ్గి పువ్వు....
కణ కణ మండే అగ్ని శిఖవు
నీవైతే...
భగ భగ మండే నిప్పు రవ్వను...
నేను...
సాహసం చేస్తున్నా నేను...
సాహసం తో సావాసం....
చేస్తున్నా నేను....
నిప్పును నిప్పుతో ....
ఆర్పాలన్న ప్రయత్నం
నాది...
పిచ్చితనమనుకున్నా....
నిప్పుల కొలిమిలో....
గులాబీలు విరబూయించాలన్న
తాపత్రయం నాది....
చెమర్చే కళ్ళు...
కన్నీటికి బదులుగా...
నిప్పులు కురిపిస్తున్నా...
వాటిని దోసిట పట్టాలన్న....
ఆరాటం నాది...
అగ్గి పూవువి నీవైతే...
వేడి పరిమళాలు...
నేను కావాలన్న
ప్రయత్నం నాది...
అవును నేను...
సాహసమే చేస్తున్నా...
నీలో మండుతున్న అగ్నిశిఖల.....
అంతరార్ధం...
నాకన్నా బాగా
ఎవరికి తెలుసు...
అంతమవుతా....
నీ అగ్ని రేఖలకు...
ఆహుతిని అవుతా...
కానీ ఓడిపోను...
నీ అగ్నికి తోడుగానే ...
ఉంటా...
మనస్వినీ...
No comments:
Post a Comment