ఎలా నవ్వగలను
మెరిసే కన్నుల వెనుక
జాలువారే కన్నీళ్ళే కనిపిస్తున్నాయి
విరిసే పెదాల మాటున
కానరాని విషాదం తొంగిచూస్తోంది
పువ్వులా నవ్వుతున్నా
చేమంతిలా విరబూసినా
నీ మెరుపులు తళుకుల వెనుక
కాటుకను మరిపించే చీకటి రాజ్యమేలుతోంది
మురిపించే మనసులో
రగులుతున్న అగ్నిగుండం సెగలు పెడుతోంది
తడిచేరిన కన్నుల వెన్నెల దోచుకోనా
నవ్వులవానలో
కానరాని చీకటిలో కరిగిపోనా
విరిసిన చేమంతి నీడలో
వెలుగురేఖలను వెతుక్కోనా
మండుతున్న మనసులో
మమతలను శోధించనా
చీకటినీ నేనే
మండుతున్న మంటనూ నేనే
పువ్వు తావిలో నీడనూ నేనే
అన్నీ నేనని తెలుసు
నేనే సమస్య అని తెలుసు
నవ్వు వెనుక
విషాదమే నేనైతే
నేనే ఎలా నవ్వగలను
మనస్వినీ
No comments:
Post a Comment