సరదా సరదా సిగరెట్టు
సరదాగానే
మొదలయ్యింది
చిద్విలాసంగా
మెరిసింది
కొంచెం
వెగటుగా
ఆపై మత్తుగా
పసందైన
రుచినేదో ఇచ్చింది
అయినా వద్దనే
అనుకున్నా
వదులుకోలేకపోయా
నలుగురిలో
నేనున్నా
సమావేశాల్లో
బిజీగా ఉన్నా
వెసులుబాటు వేళ
అటే మరలేది మనసు
అవును
అప్పట్లో
సిగరెట్ నాకు స్టేటస్ సింబల్
ఇప్పుడు అదే
నాకు వ్యసనం
మానలేకపోతున్నా
అనేక కలతలు
అప్పుడప్పుడూ సూటి
పోటి మాటలు
అంతులేని
అవమానాలు
కనులనిండా
కన్నీళ్లు
నావాళ్ళ
ఆవేదనకు అర్థం ఉంది
వాళ్ళ మాటల్లో
న్యాయం ఉంది
నన్ను
గుండెల్లో పెట్టుకునే వాళ్ళే
విమర్శల
బాణాలు విసిరుతున్నారు
అయినా ఎందుకు
భరిస్తున్నా
ఎందుకు
సిగరెట్ మానలేకపోతున్నా
దమ్ములో ఉన్న
కిక్కు తెలియక మాట్లాడుతున్నారా
ఏమీ లేకున్నా
నేనే కిక్కులో మునిగిపోయానా
బాధ్యతలు
మరిచి కిక్కులో మునిగి
నన్ను నేను
వంచించుకుంటున్నానా
నాలో మార్పు
రాదా
నేను ఈ
వ్యసనాన్ని గెలవలేనా
వ్యసనమే నన్ను
ఓడిస్తుందా
ఏమో ఏదైనా
జరగొచ్చు
గుర్రము ఎగరనూ
వచ్చు కదా
మనస్వినీ
No comments:
Post a Comment