అలౌకికం
నీకెంత ఆనందం
అంతా ఇంతా
ఇలా అడుగుతే ఏమని
చెప్పను
ఎలా చెప్పను
మాటలకు అందని భావాలు
రాతలకు దొరకని
అనుభూతులు
ఎలా పంచుకోను
తొలిసారి నువ్వు
ఉపవాస దీక్షలకు
సంసిద్ధత తెలిపితే
మనసు ఒకింత
కలవరమయ్యింది
ఎలా ఉంటావోనని
మనసు ఆందోళనకు దిగింది
మనసు మాటకు కట్టుబడిన
నువ్వు
సహర్ నుంచి
ఇఫ్తార్ వరకు
అల్లాహ్ బాటలోనే
నడిచావు
ప్రతిఘడియా నిన్నే
చూస్తున్నా
ఎలా ఉంటావోనని
క్షణాలు నిమిషాలుగా
నిమిషాలు గంటలుగా కాలం
భారంగానే నడిచినా
నీ పెదాలపై చిరునవ్వు
తొలగలేదు
దైవనామస్మరణ ఆగలేదు
అమ్మ చేతులమీదుగా
దీక్ష విరమించిన
నిన్ను చూస్తుంటే
ఎలా ఉందని అంటే ఎలా
చెప్పను
ఈద్గాహ్ లో ఈదుల్
ఫితర్ నమాజు అదా చేసిన ఆనందం
ఏదో తెలియని అలౌకిక ఆనందం
కొన్ని భావాలు
మనసులోనే
ఉండిపోతాయ్
ఆ భావాలకు నిర్వచనం
మాటల్లోనూ
రాతల్లోనూ
దొరకదు
మనస్వినీ
No comments:
Post a Comment