మనసులోనే భావాలు
చాలా రాయాలని ఉంది
ఏదేదో రాసేయాలని ఉంది
మనసుపోరలో భావాలు
ఉబికివస్తున్నాయి
ఎగసిపడుతున్న భావాలకు
అక్షరాలు కనులముందు
కదలాడుతున్నాయి
భావాలకు రూపమివ్వాలనీ
మనసును తేలికపరిచే
లేపనంగా మారాలని
అక్షరాలు
ఉబలాటపడుతున్నాయి
మనసులో మేముండలేము
మాకు విముక్తి
కల్పించమని
ప్రాధేయపడుతున్నాయి
అయినా
ఎందుకో ఏమో
మనసు ఒప్పటంలేదు
మనసు కవాటాలు
తెరుచుకోవటం లేదు
అక్షరాలకు ప్రాణం
పోయలేకపోతున్నా
ఏమయ్యిందో ఏమో గాని
మనసు భావాలను
మనసులోనే
దాచుకుంటున్నా
మనస్వినీ
No comments:
Post a Comment