బంగారు బొమ్మ
తొలిసారి
అవును తొలిసారి ఇలా
చూసాను నిన్ను
అది నువ్వేనా
నిజంగా నువ్వేనా
ఎన్నడూ చూడని రూపం
ఊహకే అందని ప్రతిరూపం
రోజూ చూస్తున్నా
నిన్ను
దగ్గరగా చాలా దగ్గరగా
నాలోనే నీవుగా
నిత్యం చూసే రూపమే
నిత్యం అదే దర్శనం
అవును
నువ్వే
నవ్వుతూ తుళ్ళుతూ
నన్ను ఏడిపిస్తూ
చిరాకు పడుతూ
హాస్యం కురిపిస్తూ
జవ్వనిలా
ప్రియురాలిలా
సఖిలా
జవరాలిలా
ప్రియసతిగా
నవ్వులు చిందించే నీలో
అంతలోనే ఇంతమార్పా
అవును నీలో చాలా
మార్పు చూసా
ఒక్కసారిగా
గుండె ఆగిపొయిందా
అనిపించింది
నా కనులముందే అలంకరణ
చేసుకున్నా
అంతలా పట్టించుకోని
నేను
ఎలా ఉన్నానూ అంటూ
నువ్వు పలకరించగానే
ఒకింత సంభ్రమం
అవును
మరో లోకం కనులముందు
కదలాడింది
దివినుంచి భువికి
దిగిన దేవకన్యలా
నాకోసమే నేలరాలిన తారకలా
మురిపించే అతిలోక
సుందరిలా
కనులముందు నిలిచావు
కొత్తగా చూసాను నిన్ను
జడలో నవ్వుతున్న
మల్లెలు
స్వర్ణకర్ణాభరణాల
మెరుపులతో
వెలుగుతున్న మోము
రాజసం కురిపించే చీర
సొగసులు
మెరుపులు చిందించే
కమర్ పట్టీ సొబగులు
స్వర్ణ కంకణాల గలగలలు
పదమంజీరాల సవ్వడులు
పెళ్లి రోజు ఆడపిల్లలా
కనులముందు దేవకాంతలా
నిన్నలా చూస్తూనే
ఉండిపోయా
దివ్య సౌందర్యమే నీది
పసిడి వెలుగుల్లో
నువ్వు
ఎంతగా మెరిసినా
ఆ పసిడికి నీవల్లే
మరింత అందం వచ్చింది
మనస్వినీ
No comments:
Post a Comment