విధి ఆడిన వింత నాటకం
చిత్రం భళా
విచిత్రం
కనీవినీ
ఎరుగని వైనం
ఎన్నడూ గానని
అద్భుతం
నేను ఏమిటో
నాకే తెలియదు
నా మనసు ఏమిటో
నాకే తెలియదు
నా అంతరంగం
నాకు తెలియనే తెలియదు
నేను ఎవరిని
ప్రేమిస్తున్నా
ఎవరిని ధ్వేషిస్తున్నా
ఎవరంటే నాకు
ఇష్టం
ఎవరంటే
అయిష్టం
అసలు నాకు ఏం
కావాలి
నేనేం
కోరుతున్నా
ఎలా బతకాలని
అనుకుంటున్నా
అసలు బతకాలని
ఉందా నాకు
మరణం వైపు
నడుస్తున్నానా నేను
ఆనందంగానే
ఉన్నానా
మనసులోనే
రోధిస్తున్నానా
ఏం చేయాలని
అనుకుంటున్నా
నా అంతరంగం
నాకే తెలియకున్నా
అందరికీ
తెలిసిపోవటం
విధి ఆడిన
వింత నాటకమే కదా
మనస్వినీ
No comments:
Post a Comment