Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday, 1 June 2016

చిరంజీవినే

చిరంజీవినే

రాలిపడుతున్న నా స్వప్నాల్లో
మీ కలలూ కనిపిస్తే
జారిపడే నా కన్నీటి చుక్కలు
మీ కంటా జాలువారితే
నా భావం మీ మనసును తాకితే
మనసు మూలలో ఏదో ఒక భావం
మీలోనూ కదలాడితే
నవ్వుతున్న నా అక్షరాన్ని చూసి
మీ పెదాలపైనా నవ్వు విరబూస్తే
మండిపడిన నా భావం
మీలోనూ ఆవేశం రగిలిస్తే
నాలో విరిసే పువ్వులు మీవే
నాలో కలిగే రోదనలూ మీవే
నా కన్నీటి చుక్కలు మీరే
నా ఆవేశమూ మీరే
నా మనసు సొదలు
మీ మనసు సొదలుగా అనిపిస్తే
మీరూ నేనూ ఒకటే
అవును
నా భావాలను చూసి
స్పందిస్తున్న ప్రతి మనసులో
ఎక్కడో ఒక చోట అదే భావముంటే
ఆ భావాల వెల్లువలో
నేను చిరంజీవినే కదా
మనస్వినీ

No comments:

Post a Comment