టాం అండ్ జెర్రీ 2
ఎవరు ఎవరి పక్షమో
తెలియదు
ఎప్పుడు ఎవరికి మద్దతు
ఇస్తారో తెలియదు
ఎవరిపై ఎప్పుడు ఎవరు
విరుచుకుపడతారో
తెలియనే తెలియదు
ఒకే పక్షమని
కనిపిస్తారు
కాదు విపక్షాలమనే
నిరూపిస్తారు
అంతలోనే కలిసిపోతారు
మరునిమిషం
తన్నుకుంటారు
ఎవరు ఎవరిపై దాడి చేస్తున్నారో
అర్థమే కాని అయోమయం
ఇది భారత రాజకీయ యవనిక
కాదు
కప్పదాటు నేతల ముచ్చటా
కాదు
నా ఇంట నిత్యం జరిగే
సందడి ఇది
అవును మా ఇంట్లో
ముగ్గురు
ముచ్చటగా ముగ్గురు
ముగ్గురు టాం అండ్
జెర్రీల కీచులాట ఇది
ముగ్గురిలో పెద్దది
మనస్విని
స్వయానా నా శ్రీమతి
అది టామో జెర్రీయో
నాకైతే తెలియదు
మరో ఇద్దరు
నాకొడుకూ కూతురూ
ఈ ఇద్దరిలో
ఎవరు టాం ఎవరు జెర్రీ
చెప్పటం కష్టం
ముగ్గురూ మంచి
మిత్రులే
ఒకరంటే ఒకరికి ప్రాణమే
సరదా సరదాగా సాగే వీరి
బంధం
నిత్యం టాం అండ్
జెర్రీ యుద్ధాన్నే తలపిస్తుంది
ఎందుకు తన్నుకుంటారో
ఎవరు ఎవరిని ఎందుకు
కొడుతున్నారో
చెప్పలేను
మమతలకు మరో రూపం ఈ
ముగ్గురూ
కీచులాటకు సజీవ దృశ్యం
ఈ ముగ్గురే
ఆప్యాయతతో అక్కున
చేర్చుకునే మాతృత్వం
మమతానురాగాలకు నిలయం
మనస్విని
సరదాగా ఘర్షణకు దిగితే
బోసినవ్వుల పాపాయే
మనస్విని
తనయుడూ తనయ ఇద్దరూ
ఇద్దరే
మనస్వినికి
పంచప్రాణాలే
No comments:
Post a Comment