సిగరెట్
సమరం
అర్ధ రాత్రి దాటింది
ఎందుకో మెలకువ
వచ్చింది
నా అలికిడికి తను
లేచినట్టుంది
నా వైపే చూస్తోంది...
నాకది కావాలనిపించింది
ఇవ్వవా అన్నట్లు
తనవైపు చూసా
కుదరదన్నట్లు చూసింది
కొంటెగా...
నాకేమో కావాలి
వెంటనే కావాలి
తను బెట్టు వదిలేలా
లేదు
తప్పదనిపించింది
అడిగేసాను ఇవ్వమని
నో అంటూ అటువైపు
తిరిగింది...
పట్టుదల పెరిగింది
నాలో
కావాల్సిందేనని భుజాలు
పట్టుకున్నా
సమరం మొదలయ్యింది
నేనూ తను
ఓటమి ఎరుగని పోరాటం...
సివంగిలా తను
రెచ్చిపోయినా
ఉడుం పట్టు నేను
వదలలేదు
నవ్వుల పువ్వులు
విరబూసినా
వేడి నిట్టూర్పుల్లో
స్వేదం చిందినా
నేనే గెలిచాను
లేదు లేదు
తను నన్ను
గెలిపించింది...
అవును నాకివ్వకుండా
మనస్విని దాచుకున్న
సిగరెట్ ప్యాకెట్
నాకు దక్కింది
సిగరెట్ సమరంలో
తనువుల తమకంలో
గెలిచింది ఇద్దరమే కదా
మనస్విని...
No comments:
Post a Comment