అన్నీ
మారిపోతే
ఒక్కసారిగా అన్నీ
మారిపోతే
నలుపూ తెలుపూ
ఇంధ్ర ధనుస్సు
రంగులుగా మారిపోతే
మెదడును తొలిచే
ఆలోచనలన్నీ
మంచు బిందువులుగా
కరిగిపోతే
మనసులో రగిలే వేదనలు
దూది పింజాలై తేలిపోతే
కాలికి గాయంచేసే
ముళ్ళు
గులాబీలై గుభాళిస్తే
ఎంత బావుంటుంది...
అన్నీ మారిపోతే
అప్పుడప్పుడూ
అనిపిస్తుంది
అన్నీ మారిపోవాలనీ...
మౌనమే నాకు నేస్తమైన
వేళ
సుడులు తిరిగే ఆలోచనలు
సునామీలై చెలరేగే వేళ
శూన్యం నుంచి మరో
శూన్యంలోకి
అడుగులు వేసే వేళ
కారు చీకటి తప్ప
కనులముందు గుడ్డి
వెలుతురూ కానరాని వేళ
మనసులో చిన్న భావన
మొగ్గ తొడుగుతుంది
అన్నీ మారిపోతే ఎంత
బావుండేదని...
అనుకోవడానికేముంది
చాలా అనుకుంటాం
అనుకున్నవన్నీ
అనుకున్నట్టుగా జరిగితే
విధి ఎందుకు
విధి రాతలు ఎందుకు
మనస్వినీ...
No comments:
Post a Comment