మనసు శోధన
ఇది శోధనా
విధి శోధనా
తెలియనే తెలియదు గాని
శోధిస్తూనే ఉన్నా
నేనెక్కడో
నన్ను నేను ఎక్కడ
కోల్పోయానో
అసలు నేనెక్కడ ఉన్నా
ఎక్కడ దాగి ఉన్నా
వెతుక్కుంటూనే ఉన్నా
నన్ను నేను
కరిగిన కలల కన్నీటిలో
కొట్టుకుపోయానా
కుట్రలు కుతంత్రాల
ఊబిలో కూరుకుపోయానా
రగిలిన ఆవేశంలో కాలిన
చితిలా మిగిలానా
నలువైపులా సమరంలో
చిగురుటాకులా
ఎగిరిపోయానా
నా మనసు నన్నే
శోధిస్తోంది
నా జాడ కోరుతూ అడుగులు
వేస్తోంది
పాపం నా మనసుకెలా
తెలుసు
నేనేమయ్యానో
ఎక్కడ కూలిపోయానో
ఎక్కడ శిధిలమయ్యానో
నన్ను మాయం చేసిన మనసే
నా జాడ కోరుతుంటే
ఎలా దొరుకుతాను
మనస్వినీ
No comments:
Post a Comment