నలుగురు దేవుళ్ళు
ఒక్కడివే గనుక
నీ ఆటలే సాగుతున్నాయి
నువ్వనుకున్నవే
జరుగుతున్నాయి
నీ మనసులో ఆలోచనలే
నెగ్గుతున్నాయి
అనుకున్నదే
చేస్తున్నావు
ఎత్తులు నీవే
పై ఎత్తులూ నీవే
నలువైపులా నీవే
రాజును బంటుగా
మార్చేది నీవే
మరో బంటును రాజుని
చేసేదీ నీవే
పడవేసేదీ నీవే
నిలబెట్టేదీ నీవే
చదరంగానికి నాలుగు
వైపులా నీవే
ఆటగాడివి నీవే
పోటీగాడివి నీవే
మా మనసులకు విలువ లేదు
మా మమతలకు గుర్తింపు
లేదు
ఆలోచనలకు అమలు లేదు
పోటీ లేదు గనుక
అడ్డే లేదు నీకు
ఒకడివే ఆడుతున్నావు
గనుక
అడిగేవారే లేరు నిన్ను
ఒకరు గాక
మరో ముగ్గురు ఉంటే
ఎవరి ఎత్తులు వాళ్ళు
వేస్తే
ఏకపక్ష క్రీడ ఉండేదా
మనుషుల జీవితాలతో
చరరంగం ఆడే దేవుడికి
మరో ముగ్గురు తోడై
ఉంటే
భూలోకం ఎలా ఉండేదో
మనస్వినీ
No comments:
Post a Comment