మధుశాలే ఆలయం...
అవును నేను తాగుతున్నాను...
తాగుతూనే ఉంటాను...
రోజూ తాగుతాను...
ఎక్కడ ఉన్నా...
ఏం చేస్తున్నా ...
తాగుతూనే ఉంటాను...
ఎందుకు తాగను...
తాగాలి తప్పదు...
మధు పాత్రలు ఒలికే...
నెచ్చెలి కన్నుల్లో...
మధురసాలు ఎండిపోతే...
అమృతం జాలువారే...
గులాబీ రేకుల పెదాలపై...
తడి ఆరిపోతే...
కన్నుల్లో ప్రేమకు బదులు...
ఆవేశం కురిస్తే...
పలుకుల్లో మధువులు కాక...
అనుమానాలు ధ్వనిస్తే...
అమృత భాండం....
ఆ హృదయం...
సుర కోల్పోయి అసురం అయితే...
నాకు నిషా కావాలి మరి...
ఎక్కడని వెతుక్కోను...
ఏమని వెతుక్కోను...
వదువులో మధువే లేకపోతే...
మధుశాలే నాకు ...
ఆలయం కాదా...
ఆ మనసులో దొరకని మైకం..
మధు పాత్రలో దొరికితే...
నిత్యం నా అడుగులు...
మధుశాలకే...
తరలిపోవా...
మనస్వినీ...
No comments:
Post a Comment