ఎవరు నేను...
పాటల తోటలో ...
మొగ్గ తొడిగిన కన్నీటి పువ్వుని నేను...
కంటి కొలనులో ...
వెచ్చదనాన్ని నేను...
ఎగసి పడే అలల్లో...
రాలిపడిన ఇసుక రేణువుని నేను...
మనసు గుడిలో ...
ఆరిపోయిన దీపం వెలుగుని నేను..
విరిసిన నీ హృదయం లో...
గురి తప్పన బాణం నేను...
వీడి వెళ్ళిన పాదంలో...
అంటుకున్న మట్టి వాసనను నేను...
ఇంతకీ ఎవరు నేను...
ఎవరికీ ఏమికాని నేను..
నేను నేనే కదా...
మనస్వినీ...
No comments:
Post a Comment