అగ్నిపునీతం నా ప్రేమ...
అగ్ని పునీతం నా ప్రేమ...
తామరాకుపై రాలిన...
స్వాతి ముత్యం నా ప్రేమ...
సాగర గర్భంలో....
మేలిముత్యం నా ప్రేమ..
మల్లెపూవు పరిమళాలపై..
మంచు బిందువు నా ప్రేమ...
బాధ్యతల సమరంలో...
వికసించినది నా ప్రేమ...
కుల మతాల బంధనాలను...
తిప్పికొట్టినది నా ప్రేమ...
ధన మదాంధుల కుట్రలను...
ఎదుర్కొన్నది నా ప్రేమ..
మనస్సుకు ప్రణమిల్లి ...
సర్వం కోల్పోయింది నా ప్రేమ...
విధి ఆడిన చదరంగంలో ...
ఓడిపోయింది నా ప్రేమ..
మనస్సుకోసం ...
మనస్సునే ధారపోసి గాయపడింది నా
ప్రేమ...
నా ప్రేమను...
నా మనస్సును ...
నా ఆలోచనను ...
ప్రశ్నించేందుకు ....
మనస్సుండాలి...
అది నిజంగా అగ్నిపునీతం..
మనస్వినీ...
No comments:
Post a Comment