తిరిగిరాని బాల్యం..
అంతా చీకటిగా అనిపిస్తే...
ఏ దారీ కానరాకపోతే...
గమ్యమే తెలియకపోతే...
మనసే భారమైపోతే....
మనసుకు కాసింత ఊరట...
మరికొంత ప్రశాంతత...
కలిగించేది మా ఊరి
చెరువుగట్టే...
ఈసారీ అక్కడికే వెళ్లాను...
ఆనకట్టపై నుంచి ...
మెట్ల మీదుగా నీటి వైపు
దిగాను..
ఒక్కో మెట్టు దిగుతుంటే...
బాల్యంలోకి ఒక్కో అడుగు
వేస్తున్నట్టు ...
అనుభూతి...
అదిగో ఆ మెట్లపైనే మేమాడుకున్నాం...
ఆ బండ రాళ్ళపైనే...
సేదతీరాం...
పట్టిన చేపల్ని అక్కడే
కాల్చుకున్నాం...
అదిగో ఆవైపు ...
అప్పట్లో సీతాఫలాల
చెట్లుండేవి...
ఇప్పుడూ ఉన్నాయి అక్కడక్కడా...
ఆ చెట్లకాయలు అక్కడే
కాల్చుకుని...
పంచుకుని తిన్నాం..
ఈ నీటిలో గంటల కొద్దీ ఈత కోట్టాం...
ఈత పోటీల్లో విజేతలమయ్యాం..
ఆ రోజులు మళ్ళీ వస్తాయా...
వస్తే ఎంత బాగుండు...
కాలం చేసిన గాయాలు..
మళ్ళీ వచ్చే బాల్యం తో..
మానిపోవా...
మనస్వినీ...
chaalaa bagundi
ReplyDeleteబాల్యం కదండీ...
Delete