నీ మువ్వల సవ్వడి
నేనవుతా...
లయబద్దమైన ....
నీ నర్తనం ....
శృతి లయలను కోల్పోతే...
పల్లవించిన నీ రాగంలో...
పదాలు తారుమారయితే...
గులాబీ రేకుల నీ పెదాలు...
మెరుపులే కోల్పోతే...
వెన్నెల కురిపించే నీ నయనాలు...
నీటి సుడులనే కురిపిస్తే...
నీ పాటకు పల్లవి నేనవుతా...
నీ అధరాలపై చిరునవ్వుని నేనవుతా...
నీ కన్నులలో వెలుగును నేనవుతా..
శృతి తప్పిన నీ నాట్యంలో ....
రాలిపడిన నీ మువ్వలో ...
సవ్వడి నేనవుతా...
మనస్వినీ...
No comments:
Post a Comment