నేను మాయమయ్యాను..
అద్దం ముందు నిలబడి ....
నన్ను నేను చూసుకున్నాను...
నా రూపం. ....
నన్ను చూసి నవ్వింది...
నాకేమీ అనిపించలేదు...
అక్కడి నుంచి పక్కకు
జరగగానే...
నా ప్రతిబింబం మాయమయ్యింది...
నన్ను చూసి నవ్విన నా ఉనికి...
అలా దర్పణం లో కలిసిపోయింది...
ఉరుకులు పరుగులతో...
వాగులు వంకలతో...
హోరుగా ప్రవహించిన నది...
సముద్రంలో కలిసి మాయమైనట్లు...
నేను చెలియను చూసాను...
ఆ కళ్ళల్లో నేను అల్లుకున్న
కలలు చూసాను..
ఒక అలలా...
నులి వెచ్చని వెన్నెలలా...
ఒక కన్నీటి సుడిలా..
ఓ ఆవేశంలా...
ఒక భావంలా...
తనని చేరుకున్నాను...
సముద్రంలో తాను కలిసిన చోట...
ఉనికిని కోల్పోయిన నదిలా...
నేను తనలో కలిసి మాయమైపోయాను...
ఇప్పుడు నాలో నేను లేను...
నిజం చెప్పాలంటే...
నాకు ఉనికే లేదు..
మనస్వినీ..
No comments:
Post a Comment