మౌన రాగం...
మూగబోయిన హృదయ రాగం..
కోరుకుంటున్నది...
తనను మళ్ళీ ఎవరైనా పాడాలని...
చెదరిన గుండె తంత్రులు...
అడుగుతున్నాయి....
తమను మళ్ళీ సవరించాలని...
చెమర్చిన కనులనుంచి ...
జారిపడుతున్న నీటి చుక్క...
ఇంకా ఆశగా ఎదురు చూస్తోంది..
తనని ఎవరైనా దోసిట పడతారని...
శ్వాస ఇంకా సాగుతోంది....
తనకెవరైనా....
ఊపిరి పోస్తారేమోనని...
ఆశ ఆశే...
కానీ ఆశకు అంతుందా...
ఆశలోనే నిరాశ దాగి ఉందన్న
సత్యం...
తెలియనిదా...
మనస్వినీ...
No comments:
Post a Comment