Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday, 25 December 2014

నాదన్నది ఏమున్నది నాలో...



నాదన్నది ఏమున్నది నాలో...

నేను నేను కాదు...
నాలో నేను లేను...
అప్పుడు నాలోనే ఉన్న నేను...
ఇప్పుడు నాలో నేనే ...
కానరాను...
ఏదీ నాది కాదు...
నాడు నాదన్నది ఏదీ నాది కాదు...
నా ఆలోచనలో నేను లేను...
నా అంతరంగంలో ...
నేను మాయమయ్యాను...
నా అడుగులు నావి కాదు...
నా జాడలే కానరావు...
నిజం ఇది నిజం...
నాదన్నది ఏమీ లేదు నాలో...
నేనే నువ్వయ్యాను ఏనాడో...
నా శ్వాసే నాది కాదు...
అది నీ ఊపిరే...
నాది నాది కానప్పుడు...
నేనేం చేయగలను...
నీ ఆనతే లేకపోతే...
విడలేను ఊపిరి నేను...
మనస్వినీ...

No comments:

Post a Comment