నీతోనే అన్నీ...
నీ అడుగులు నా వైపు నడిస్తే...
నా తోటలో పువ్వులు...
విరబూస్తాయి...
విరబూసిన పువ్వులు...
నవ్వులే రువ్వుతాయి...
మోడు వారిన మానులో...
చివుర్లు మొలుస్తాయి...
నీ పద సవ్వడికి...
ఎద సవ్వడులు జత కలుస్తాయి...
నీ కన్నుల వెన్నెలకు...
హృదయ కమలాలు వికసిస్తాయి..
నీ పెదాల మెరుపుల్లో ...
విద్యుల్లతలే అల్లుకుంటాయి...
నీ పద మువ్వల సవ్వడిలో...
కోటి రాగాలే పలుకుతాయి...
నను వీడి నీవు వెళితే...
నా వసంతమే ...
వాడిపోదా...
మనస్వినీ...
No comments:
Post a Comment