చిన్నబోయిన మనస్సు...
ఎందుకో ఆకాశం నల్లబడింది....
పాలమీగడ వెలుగుల శశిని...
మబ్బులు కమ్ముకున్నాయి...
ఎందుకో విరిసిన పువ్వులు...
చిన్నబుచ్చుకున్నాయి...
నవ్వే ఆ పువ్వుల్లో...
నవ్వులు మాయమయ్యాయి ఎందుకో...
చల్లగా చలి చలిగా వీచే గాలిలోనూ...
వేడి నిట్టూర్పులే...
తగులుతున్నాయి ఎందుకో...
గల గల పారే సెలయేరు...
సవ్వడి లేకుండా ...
మౌనంగా సాగిపోతోంది
ఎందుకో...
ఉండి కూడా లేనిదిగా...
ఉన్న ప్రేమను పొందలేక
...
చిన్నబోయిన...
నా మనస్సుకు అవి ...
సంకేతాలే...
మనస్వినీ...
No comments:
Post a Comment