కురిసిన కన్నీరు..
తెల్ల వారింది...
కళ్ళు ఇంకా సరిగ్గా తెరుచుకొనే లేదు...
నిద్ర మత్తులోనే లేచాను...
అలా అడుగులు వేస్తూ
బయటికి వచ్చాను...
బయట ఇంకా మంచు
కురుస్తోంది...
ఆశ్చర్యం....
నాకేమాత్రం చలి వేయటం లేదు..
మెయిన్ గేటు తీసుకుని ఇంకా బయటికి వచ్చాను...
నిజంగానే అంత మంచు కురుస్తున్నా ....
నేను మాత్రం వెచ్చగానే ఉన్నా...
ఇంటి ముందు ఓ బండరాయిపై
కూర్చున్నా...
ప్రశాంతంగా.... మౌనంగా...
అప్పుడే లేచిన కొందరు చలికి వణుకుతూనే..
అటూ ఇటూ తిరుగుతున్నారు...
నన్నెవరూ గమనించటం లేదు...
ఎందుకో నేను అలాగే కూర్చున్నా...
అంతలోనే మా ఇంట్లో ఎదో అలికిడి...
ఏవో అరుపులు...
అయినా నేను అలాగే కూర్చున్నా...
సమయం సాగుతూనే ఉంది...
ఎవరెవరో మా ఇంటికి వస్తున్నారు...
ఇంతకీ ఏం జరిగిందా అని...
ఇంట్లోకి తొంగి చూశాను...
మొత్తానికి ఏదో జరిగింది...
మళ్ళీ అక్కడే కూర్చున్నా...
ఎవరెవరో వస్తున్నారు...
ఇంటి ముందు షామియానాలు వేస్తున్నారు...
అందరూ వస్తున్నారు...
నాకు నచ్చిన వాళ్ళు ....
నచ్చని వాళ్ళు...
నేను అసహ్యించుకునే వాళ్ళు...
నన్ను అసహ్యించుకునే వాళ్ళు..
కొందరు ఎందుకో నా మీద సానుభూతి చూపిస్తే...
మరికొందరు నన్ను తిడుతున్నారు...
అన్నీ నేను వింటున్నా నన్నెవరూ పట్టించుకోవటం లేదు...
నా గారాల పట్టికి ఏమయ్యిందో ...
స్పృహ కోల్పోయిందట....
నా తనయుడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడట...
అంతలోనే మరో అలికిడి...
మెయిన్ గేటు తెరిచారు...
తెల్లని వస్త్రాలు ధరించిన నా వాళ్ళు ఎదో మోసుకుని ...
బయటికి వచ్చారు...
పరికించి చూశాను అది నేనే..
తెల్లని గుడ్డలో వెలుగుతున్న మోముతో
నిద్రిస్తున్నట్టుగా ఉన్న నన్ను మోసుకు వెళుతున్నారు..
అప్పుడర్ధమయ్యింది నాకు...
నేను మరణించానని...
అది నా అంతిమ యాత్ర అని...
అలా చూస్తూ నిలబడిపోయా...
మెల్లగా నేనూ ఆ యాత్ర వైపు అడుగులు వేసాను...
అలా వెళుతూ వెళుతూ...
ఇంటివైపు తిరిగి చూసాను...
గుండెలు పగిలేలా రోదిస్తున్న నా వాళ్ళు కనిపించారు...
ఆ రోదనలో వేదనలో...
రాలి పడుతున్న కన్నీటి చుక్కల్లో...
ఓ బిందువు తన ది కూడా..
అప్పుడు అనిపించిది...
కొద్దిగా చలిగా...
అప్పటికే ఎండ కాస్తున్నా...
ఆ కన్నీటి చుక్క ఎంత విలువైనదో...
తప్పదు గుండెలు పగిలినా..
కన్నులు ఎండినా...
కన్నీటి వాన కురవాల్సిందే...
మనస్వినీ..
నాకు నచ్చిన వాళ్ళు ....
ReplyDeleteనచ్చని వాళ్ళు...
నేను అసహ్యించుకునే వాళ్ళు...
నన్ను అసహ్యించుకునే వాళ్ళు..
కొందరు ఎందుకో నా మీద సానుభూతి చూపిస్తే...
చాలా బాగున్నాయి ఇ లైన్స్
ఒక సారి క్రింది లింకు చూడగలరు
http://gavidipydinaidu.blogspot.in/2011/07/blog-post_16.html?m=1