నీకు సలాం...
నెలవంక ఎందుకో ...
చిన్నబోయింది....
చల్లని వెన్నెల కురిపించే...
ఆ చందమామ...
మబ్బుల పరదాల మాటున...
మొహం చాటేసుకుంది...
జాబిలమ్మతో ఆట పాటల విందుకు...
చీకటి దుప్పటిని విసిరేసి...
బయటకు వచ్చిన...
తారకలూ ఎందుకో
ముడుచుకున్నాయి...
ఎదలోని రోదలతో...
ఎనలేని సొదలతో....
తన ఇష్ట సఖి పుడమిని...
ముద్దాడాలని ..
వలపుల అలలను విసిరే ...
సాగరుడు ఎందుకో ...
మౌనముద్రలోకి జారుకున్నాడు...
సవ్వడిలేని అలలు...
తలవంచుకుని...
వెనక్కి జారుతున్నాయి...
ఏమయ్యింది ఈ వేళ...
నెలవంక ఎందుకు చిన్నబోయింది...
తారకలు మళ్ళీ ఎందుకు చీకట్లోకి
దూరిపోయాయి...
సాగరానికి ఏమయ్యింది...
ఎందుకు చేతులు ముడుచుకుంది...
మనసుపోరు తాళలేక...
అడిగేశాను...
నాలోని చల్లదనం...
పాలమీగడ మెరుపులు..
తనముందు వెల వెల పోతే ...
ఏం చేయను అంటూ జాబిలమ్మ
అలిగింది..
తనలోని మెరుపులు.. తళుకులు..
మాకెక్కడివి అంటూ ...
తారకలు చిన్న బోయాయి..
నాలోని ఆవేశం..
నాలోని ఉత్సాహం ...
నా ఎదపొంగులు ...
అన్నీ ఆమే దోచుకుంటే...
నన్ను చూసే వారెవ్వరు ...
అంటూ సాగరం కన్నీటి
పర్యంతమయ్యింది...
ఇవేమీ పట్టించుకోని నువ్వు...
చిద్విలాసంగా ...
సోయగాలు చిందిస్తూనే
ఉన్నావ్...
ప్రకృతి అందాలకే సవాలు విసిరే
నీకు...
నా సలాం...
మనస్వినీ..
No comments:
Post a Comment