Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday, 11 December 2014

రాలిన రాగం...



రాలిన రాగం...
నా మనోవీణ తంత్రులు...
శృతి తప్పాయా అనిపిస్తోంది...
నా రాగం ఎందుకో లయ తప్పుతోంది...
జాలువారే నా గీతం ....
మెల్లమెల్లగా మూగబోతోంది...
మనో వీణ తంత్రులను...
సవరించాలనీ...
గతి తప్పుతున్న  రాగాన్ని...
మళ్ళీ స్వరపర్చాలనీ....
తపిస్తోంది నా మనస్సు...
గుండె పుస్తకంలోనుంచి...
జారిపడి చెల్లా చెదురైన ...
అక్షరాలను ...
మళ్ళీ భావయుక్తంగా...
పొందుపర్చాలనీ...
అందమైన పాటల పూదోటలో...
కవితల పూలను...
విరబూయించాలని..
ఆరాటపడుతోంది...
నా హృదయం...
నా శ్వాసలో ఊపిరే...
నీ వెంట నడిచి వెళ్ళిపోతే...
రాలిపడిన రాగాలను...
మళ్ళీ సవరించేదెలా...
మనస్వినీ...

No comments:

Post a Comment