గులాబీ సంవాదం..
అలా ఒంటిగా కూర్చున్నా...
ఏదో ఆలోచిస్తూ...
ఝమ్మని గాలి తగిలింది...
గాలితోపాటు...
ఎక్కడినుంచో ఎగిరివచ్చి ...
గుండెను తాకింది ఓ గులాబి..
అది నాతో ఎప్పుడూ ఉసులాడే నేస్తమే...
గులాబీని చేతుల్లోకి తీసుకున్నా...
ఆర్తిగా ముద్దాడా...
అయినా ఆ గులాబీలో పరవశం లేదు..
పరికించి చూశాను...
వన్నెలు చిందే గులాబీ
రేకులు చిన్నబోయి ఉన్నాయి..
వన్నెలన్నీ శోభను కోల్పోయాయి...
ఏమయ్యింది గులాబీ అని ఆప్యాయంగా అడిగాను...
అప్పుడు చిన్నగా పలికింది గులాబీ...
ఎన్ని కష్టాలున్నా నన్ను చూసి...
కవితలు రాసే నీవు ఎందుకు దిగాలుగా ఉన్నావని అడిగింది..
నీ భావనలకు మూలం అయిన నేను...
నీ కవితల్లో విషాదమే రాజ్యమేలుతుంటే ...
ఏడవకుండా ఎలా ఉండగలను మిత్రమా...
గులాబీ ప్రశ్నలకు నాదగ్గర ...
సమాధానముందా...
నాదన్నది నాది కాకుండా ...
నా మనసే నేను నీది కాదంటూ..
వీడిపోతే...
నా భావుకతలో...
విషాదం కాకుండా...
ఆనందం తాండవిస్తుందా...
ఇది ఆ గులాబీకి...
ఎలా చెప్పను...
మనస్వినీ...
No comments:
Post a Comment