ఎవరు
నీవు...
ఎవరు నీవు...
ఎక్కడి నుంచి వచ్చావు ...
నీది ఈ లోకం కాదు .. నీవు భ్రమవా .. లేక
భ్రాంతివా...
నిజమా ..అబద్దమా...
నా మనస్సులో పుట్టిన అనుమానమా...
మెదడులో పుట్టిన ఆలోచనవా...
ఏదీ కాదు ...ఏమీ కాదు..
అయిన నువ్వున్నావు....
నాకు కనిపిస్తూనే వున్నావు...
ఒక్కో సారి అస్పష్టంగా..
మరో సారి చాలా స్పష్టంగా....
నాకు చాలా దగ్గరగా..
నీ నిట్టూర్పులు నాకు చెబుతున్నాయి..నువ్వు
వున్నావని ....
అయినా
నా మనస్సు హెచ్చరిస్తోంది నువ్వు లేనే లేవని..
ఒక కల్పనవనీ ఒక భావనవనీ..
మరి నన్నెందుకు వెంటాడుతున్నావు..
అణుక్షణం నాతోనే ఉంటున్నావు లీలగా ఏదో
చెబుతున్నావు..
నువ్వేం చెబుతున్నావో
తెలియని నేను..
ఇదంతా భ్రాంతి అనుకోవాలా నిజమని నమ్మా లా....
నేనెక్కడికెళ్ళినా నీ ఉనికి నాకు
తెలుస్తూనే ఉంది..
నాకే కాదు నువ్వు నాతో ఉన్నావని...
ఆప్పుడప్పుడు ఇతరులకూ తెలుస్తోంది...
అసలు ఎవరు నువ్వు...
నీకేం కావాలి...ఏం కోరుకుంటున్నావు...
నా మనసులో నీకు స్థానం లేదు...
ఎందుకంటే నువ్వు ఎవరో నాకు తెలియదు...
నాలో ఉన్నది నువ్వు కాదనీ తెలుసు..
మరి నేను నీవు కాదని నీకు మాత్రం
తెలియదా...
అయినా నాతోనే ఉన్నావెందుకు...
క్షణం కనిపించి మరు క్షణం మాయమవుతావు...
నీవు నాకు రక్షణవా లేక హెచ్చరికవా...
ఏం చెప్పాలనుకుంటున్నావు ఏమి
చేయాలనుకుంటున్నావు...
ఒక్కసారి మంద్రంగా నవ్వుతావు.....
మరోసారి దీనంగా కనిపిస్తావు....
ఒక్కసారి నాతోనే పయనిస్తావు....
నేను నిద్రలోకి జారుకుంటే సపర్యలకైనా సిద్ధపడతావు ...
నీ ప్రేమకు స్పందించాలా నీ మాయలకు భయపడిపోవాలా..
జీవన సంధ్యలో చేరుకున్న నేను బాల్యం
నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను...
నేను మారాను ..నా వేశ భాషలు మారాయి..
నీవు మాత్రం నిత్య జవ్వనిలా ఉండి
పోయావు...
నీవు మనిషివేనా లేక అతీత శక్తివా...
నీవు నా మంచి కోరినా నా చెడును కాంక్షించినా...
ఇప్పటివరకైతే నీవల్ల నాకేది జరగలేదు..
ఇప్పటికైనా ఒక్కసారి చెప్పవా నీవు
ఎవరో...
నేను మాత్రం చెప్పగలను......
నీవు నా ఊహల్లో లేవు జీవితంలోనూ లేవు...
అయినా నీ ఉనికిని చాటుకుంటున్నావు
నీవు..
మరో మాటలో చెప్పనా...
నీవు కాదు ...
నా మనస్వినీ...
No comments:
Post a Comment